కోడెల మృతికి ప్రభుత్వ వేధింపులే కారణం: చంద్రబాబు

అనేక పోరాటాలు చేసి, పల్నాడు పులిగా పేరు ఘడించిన మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మానసిక బాధ, అవమానం భరించలేక ఉరి వేసుకుని మరణించాడంటే ఆ వార్తను జీర్ణించుకోలేకపోతున్నామని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అన్నారు. బాలకృష్ణ తనకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పారని ఆయన అన్నారు.

జరిగిన ఘటనను ఊహించుకుంటే బాధ, ఆవేదన కలుగుతోందని ఆయన అన్నారు. ఒక పైర్ బ్రాండ్ గా ,సేవాభావంతో ఎన్.టి.ఆర్.పిలుపు ఇస్తే రాజకీయాలలోకి వచ్చారని ఆయన అన్నారు.అప్పుడు పేదల డాక్టర్ గా ఉన్న శివప్రసాదరావు రాజకీయాలలోకి వచ్చారని అన్నారు.మూడు నెలల నుంచి వేదింపులను చూస్తున్నాం..ఆ వేదింపులు భరించలేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారని అన్నారు.పల్నాడు పులి అని పిలిచేవారని, టైగర్ లా బ్రతికారని, భయం అనేది తెలియని వ్యక్తి అని, ఈ ప్రభుత్వం వచ్చాక, వీరి వేధింపులు భరించలేక శారీరక బాధ,మానసిక బాధ , ఏ అవమానం వస్తుందోనన్న బాధతో ఆత్మహత్య చేసుకున్నారని ఇది జీర్ణించుకోలేని విషమని ఆయన అన్నారు.ఇటీవలికాలంలో అనేక పోరాటాలు చేశామని ఆయన అన్నారు.చివరికి ఒక నాయకుడు ఇలా ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని అన్నారు. ఎన్.టి.ఆర్.కోరిక మేరకు బసవతారకం ఆస్పత్రికి చొరవ తీసుకున్నారని అన్నారు.తనకు కూడా నిద్రపట్టడం లేదని తనతో చెప్పారని, అయినా ధైర్యం గా ఉండాలని చెప్పానని చంద్రబాబు అన్నారు.ప్రజలందరూ దీనిపై చర్చించాలని ఆయన అన్నారు.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.