రియల్‌మీ ఇండియా సీఈఓ దూకేసాడు!

దూకేస్తానంటూ కొంతకాలంగా ట్విట్టర్‌లో ఫ్యాన్స్‌కు ఛాలెంజ్ విసురుతున్న రియల్‌మీ ఇండియా సీఈఓ మాధవ్ షేఠ్... ఏకంగా 13,000 ఎత్తు నుంచి కిందకు దూకేశారు. త్వరలో తాను స్కై డైవింగ్ చేయబోతున్నట్టు కొంతకాలం క్రితమే ప్రకటించారాయన. రియల్‌మీ 5 ప్రో స్మార్ట్‌ఫోన్ 1,30,000 పైగా యూనిట్స్ అమ్మినందుకు ఆకాశంలో 13,000 అడుగుల ఎత్తు నుంచి స్కైడైవింగ్ చేశారు. 10 రియల్‌మీ 5 ప్రో యూనిట్స్‌కు 1 ఫీట్ చొప్పున లెక్కించి మరీ 13,000 ఎత్తు నుంచి కిందకు దూకారు రియల్‌మీ ఇండియా సీఈఓ మాధవ్ షేఠ్. ఆ వీడియోను రియల్‌మీ అఫీషియల్ యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేశారు. ఆ వీడియో ఇక్కడ చూడండి.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.