ఎట్టకేలకు ఒప్పుకున్న నటి

రాఖీ సావంత్‌ పెళ్లి చేసుకున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలకు ఆమె ముగింపు పలికింది. యూకేలో ఉన్న ఎన్నారై బిజినెస్ మెన్ రితీశ్ ను పెళ్లాడానని ఆమె ప్రకటించింది. అతి తక్కువ మంది బంధుమిత్రుల సమక్షంలో తమ పెళ్లి జరిగిందని తెలిపింది. పెళ్లి తర్వాత రితీశ్ యూకే వెళ్లిపోయాడని... వీసా కోసం తాను ఎదురు చూస్తున్నానని చెప్పింది. రితీశ్ తన అభిమాని అని తెలిపింది.

ప్రభు చావ్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూ సమయంలో అతను తనను మొదటి సారి చూశాడని... ఆ తర్వాత వాట్స్ యాప్ ద్వారా మెసేజ్ పంపాడని రాఖీ చెప్పింది. ఆ తర్వాత ఇద్దరం మంచి స్నేహితులమయ్యామని... ఇదంతా ఏడాదిన్నర క్రితం జరిగిందని తెలిపింది. ఇంత మంచి భర్తను తనకు ఇచ్చినందుకు జీసస్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పింది. సినీ పరిశ్రమతో తన అనుబంధం ఇకపై కూడా కొనసాగుతుందని తెలిపింది. 2020 కల్లా ఓ బిడ్డకు తల్లి కావాలనేది తన కోరిక అని రాఖీ చెప్పింది.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.