పూరితో విజయ్ దేవరకొండ సినిమా చేస్తున్నాడా...లేదా...?

రౌడీ హీరో విజయ్ దేవరకొండ డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తో సినిమా చేయనున్న విషయం తెలిసిందే. అయితే డియర్ కామ్రేడ్ సినిమా ప్లాప్ అయిన తరువాత విజయ్ కథల విషయంలో చాల ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. అయితే ఇప్పుడు ఇంద్రగంటి మోహన కృష్ణ చెప్పిన కథ నచ్చటంతో ఇంద్రగంటికి కూడా ఓకే చెప్పాడని ప్రచారం జరుగుతుంది.

అయితే ఇప్పుడు పూరితో చేయాల్సిన ఫైటర్ సినిమా ఎప్పుడు మొదలవుతుంది. అసలు మొదలవుతుందా అన్నదానిపై ఏవిధమైన క్లారిటీ ఇవ్వలేదు. ఫైటర్ కథాంశం గురించి ఇప్పటికే రకరకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి. ఇందులో విజయ్ 6 ప్యాక్ తో రఫ్ గా కనిపిస్తాడని.. అందుకోసం కసరత్తులు చేస్తూ లుక్ ఛేంజ్ చేస్తున్నాడని, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నాడని ప్రచారమవుతోంది. అదేవిధంగా విజయ్ ఈ సినిమాలో మూగవాడిగా కనిపించి షాకిస్తాడని మరొక ప్రచారం జరుగుతుంది. ఇవి ఇలా ఉంటే విజయ్ స్క్రిప్టునే మార్చేయాలని పూరికి సూచించాడంటూ మరో ప్రచారం వేడెక్కిస్తోంది. ఇందులో ఏది నిజం ఏది అబద్దం అన్నది పూరి బృందం చెప్పాల్సి వుంది.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.