నువ్వంటే నాకు చాలా ఇష్టం: ప్రియా ప్రకాష్‌

ఒక్కసారి కన్నుగీటి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న భామ ప్రియా ప్రకాష్ వారియర్‌. ఒరు ఆదార్‌ లవ్‌ సినిమాతో సెన్సేషన్‌ సృష్టించిన ఈ భామ త్వరలో బాలీవుడ్ వివాదాస్పద చిత్రం శ్రీదేవి బంగ్లాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. మలయాళ, హిందీ ఇండస్ట్రీలలో బిజీగా ఉన్న ఈ భామకు ఓ టాలీవుడ్‌ యంగ్ హీరో అంటే చాలా ఇష్టమట.

తాజాగా ప్రియా ప్రకాష్ వారియర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో సెన్సేషనల్‌ హీరో విజయ్‌ దేవరకొండతో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేశారు. ఆ ఫోటోతో పాటు ‘నువ్వంటే నాకు చాలా ఇష్టం’ అంటూ కామెంట్ చేశారు ప్రియా. ఈ ఫోటో ఏ సందర్భంలో దిగారన్న విషయం వెల్లడించకపోయినా ప్రియా పోస్ట్‌ చేసిన కొద్ది నిమిషాల్లోనే ఆ పోస్ట్ వైరల్‌గా మారింది.


 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.