ఈ నెల 14న ప్రధాని మోదీ బహుమతుల వేలం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లభించిన 2772 కానుకలను ఈ నెల 14న వేలానికి ఉంచనున్నారు. ఆన్‌లైన్‌ విధానంలో వీటిని వేలానికి పెట్టనున్నట్టు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్‌ పటేల్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ వేలంలో కనిష్ట ప్రాథమిక రూ.200 గానూ, గరిష్ట ప్రాథమిక ధర రూ.2.5 లక్షలుగా ఉంటుందని చెప్పారు. ప్రధానికి లభించిన కానుకల్లో కొన్నింటిని (1800) ఈయేడాది జనవరిలో వేలం వేసిన సంగతి తెలిసిందే. ఇలా సమకూరిన మొత్తాన్ని గంగానది ప్రక్షాళన కార్యక్రమానికి వినియోగిస్తామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం గంగా నదిని శుభ్రపరిచేందుకు ప్రతిష్టాత్మకంగా నమామి గంగా పేరుతో ఓ ప్రాజెక్టును చేపట్టిన సంగతి తెలిసిందే.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.