వ్యాధి వచ్చాక వైద్యం కాదు రాకుండా జాగ్రత్త తీసుకోవాలి:ఈటెల

మెరుగైన వైద్య సేవలు అందించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మారుమూల ఏజెన్సీ ప్రాంతాలకే మొదటి ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా బుధవారం భద్రాచలం ఏరియా ఆస్పత్రిని మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీజనల్‌ వ్యాధులు వచ్చాక వైద్య సేవలు అందించడం కంటే అవి ప్రబలకుండా ముందస్తు నియంత్రణ చర్యలు తీసుకునే విషయంలో వైద్య ఆరోగ్య సిబ్బంది పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ శాఖలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. మంచి చేస్తే గుండెల్లో పెట్టుకుని చూసే జిల్లా భద్రాద్రి జిల్లా అని అన్నారు. ఇలాంటి ఏజెన్సీ జిల్లాలో వైద్యసేవలు అందించే అవకాశం రావడం వరంగా భావించాలన్నారు. కష్టపడి వైద్యసేవలు అందజేస్తే వచ్చే తృప్తి మాటల్లో చెప్పలేనిదని అన్నారు. నెగెటివ్‌ ప్రచారాన్ని చూసి కుంగిపోవద్దని చెప్పారు. జిల్లాలో 137 డెంగీ కేసులు గుర్తించినప్పటికీ ఇప్పటివరకు ఈ సీజన్‌లో ఒక్క డెంగీ మరణం కూడా లేకుండా చేశారని వైద్య సిబ్బందిని అభినందించారు. ఆశ కార్యకర్తలు, అంగన్‌వాడి టీచర్లతో కమిటీలు వేసి వ్యాధుల నియంత్రణ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అనంతరం ఆస్పత్రి పరిసరాలను పరిశీలించారు. ఆస్పత్రిలో రోగులను పరామర్శించి మెరుగైన సేవలు అందుతున్నాయా లేదా అని తెలుసుకున్నారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.
 

Most Viewed

జగన్ పాలన బాగుంటే సినిమాలు చేసుకుంటా అన్నవుగా..తథాస్తు!

అభివృద్ధి రానప్పుడు..మారిస్తే, కంగారెందుకు?

జగనన్న గోరుముద్ద.. రోజుకో రకం భోజనం.. వైరల్ అవుతున్న మెనూ!

సరిలేరు నీకెవ్వరు మూవీ సరికొత్త రికార్డు

ఈరోజు రాత్రి అత్యవసర భేటీ.. మంత్రులకు సీఎం ఆదేశం

దొంగతనం చేస్తూ.. అడ్డంగా దొరికిపోయిన పోలీస్.. వైరల్ వీడియో

ఐటీఐలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం...

మళ్ళీ పవన్ కి సెటైర్ వేసిన ఆర్జీవీ!

వైసీపీ నేతలకి తలనొప్పిగా మారిన మూడు రాజధానుల బిల్లు

వైజాగ్ వద్దు, ఈసారికి విజయవాడ: జగన్ సర్కార్

ఇండియా పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ స్టార్ హీరో..!

అప్పుడు చంద్రబాబు.. ఇప్పుడు జగన్.. రియల్ ఎస్టేట్ మాఫియా

హాట్ హాట్ ఫోటోలతో.. సురేఖావాణి రచ్చ!

RRR అప్డేట్: రంగంలోకి బాలీవుడ్ సూపర్ స్టార్

తెలంగాణాలో మున్సి‘పోల్స్’.. ప్రత్యేక ఏర్పాట్లు

అసెంబ్లీ సమావేశాలలో చంద్రబాబుపై విమర్శల దాడి పెంచిన వైసీపీ

టీడీపీకి మరో కీలక నేత రాజీనామా..?

జగన్, చంద్రబాబుల ఆసక్తికర సంభాషణ

అంతా.. నువ్వే చేసావు.. చంద్రబాబు!

కృష్ణంరాజు 80 వ పుట్టినరోజు ఫొటోస్