ప్రతి రోజూ పండగే మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో గీతా ఆర్ట్స్ 2, UV క్రియేషన్స్ బ్యానర్స్ పై మారుతి దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్, రాశీఖన్నా జంటగా గ్రామీణ నేపథ్యం లో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ప్రతి రోజూ పండగే మూవీ డిసెంబర్ లో రిలీజ్ కానుంది సత్యరాజ్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. థమన్ SS సంగీతం అందిస్తున్నారు.

భలే భలే మొగాడివోయ్, మహానుభావుడు వంటి సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ ను రూపొందించిన మారుతి, ప్రతి రోజూ పండగే మూవీ తో ప్రేక్షకులను మరోసారి అలరించనున్నారు. చిత్ర యూనిట్ ప్రతి రోజూ పండగే మూవీ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ లో సత్యరాజ్ చిన్నపిల్లాడిలా వర్షంలో ఉత్సాహం గా గెంతుతుండగా సాయి ధరమ్ తేజ్ వారిస్తున్నట్టుగా ఉంది. వర్షం ను ఎంజాయ్ చేయడానికి వయసుతో పనేముంది అనే విధంగా రూపొందించిన పోస్టర్ ఆహ్లాదకరంగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకొంది.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.