ప్రతిరోజూ పండగే ఫస్ట్ లుక్

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. సత్యరాజ్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ బ్యానర్లపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.



అయితే ఈరోజు సినిమా ఫస్ట్‌లుక్‌ని మూవీ టీం రిలీజ్ చేసింది. ఆ పిక్చర్‌లో సాయి ధరమ్‌ తేజ్ గొడుగు పట్టుకుని సత్యరాజ్‌కి జాగ్రత్తలు చెబుతున్నట్టు సత్యరాజ్ చిన్నపిల్లాడిలా గంతులు వేస్తున్నట్లు చిత్రంలో కనిపిస్తోంది. పచ్చటి బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ సినిమా ఫస్ట్ లుక్ అందరినీ అలరిస్తోంది. ‘ప్రతీరోజూ పండగే’ సినిమా ఫస్ట్ లుక్ చూస్తుంటే.. ఓ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్‌లో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.