ప్రముఖ నిర్మాత చేతికి ‘బిగిల్‌’ తెలుగు రైట్స్

అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో త‌మిళ స్టార్ హీరో విజ‌య్ హీరోగా స్పోర్ట్స్ యాక్ష‌న్ డ్రామా ‘బిగిల్‌’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన తెరి(పోలీస్‌), మెర్స‌ల్‌(అదిరింది) సినిమాలు సూపర్ హిట్ అవ్వగా.. ఇది మూడూ సినిమా కావడం తో దీనిపై కూడా మంచిఅంచనాలు ఉన్నయి. ప్రస్తుతం షూటింగ్ తుది దశకు చేసుకున్న ఈ సినిమాను తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేయనున్నారు. అన్ని పనులు త్వరగా ముగించి దీపావళికి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు చిత్ర యూనిట్. న‌య‌న‌తార హీరోయిన్‌ గా న‌టిస్తోన్న‌ఈ సినిమాను ఏజీయ‌స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకం పై క‌ల్పాతి అఘోరామ్ నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉండగా ఈ సినిమా తెలుగు హక్కులు ఈస్ట్ కోస్ట్ బ్యాన‌ర్‌ దక్కించుకున్నట్టు తెలుస్తుంది. ఈ సంద‌ర్భంగా నిర్మాత మ‌హేశ్ కొనేరు మాట్లాడుతూ -“`బిగిల్‌ సినిమా హ‌క్కులు మా ఈస్ట్ కోస్ట్ బ్యాన‌ర్‌కు ద‌క్క‌డం చాలా ఆనందంగా ఉంది. నిర్మాత క‌ల్పాతి అఘోరామ్‌గారికి, హీరో విజ‌య్‌గారికి స్పెష‌ల్ థ్యాంక్స్‌. 118`తో మా బ్యాన‌ర్‌లో సూప‌ర్‌ హిట్ సాధించాం. అలాగే జాతీయ ఉత్త‌మ‌న‌టి కీర్తి సురేశ్‌ తో మిస్ ఇండియా సినిమాను నిర్మిస్తున్నాం. ఈ నేప‌థ్యంలో మా బ్యాన‌ర్‌లో విజ‌య్, అట్లీ క్రేజీ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డం ఆనందంగా ఉంది. త్వ‌ర‌లోనే తెలుగు టైటిల్‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తాం“ అన్నారు.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.