వైసీపీ మీద ప్రజల్లో చెదరని నమ్మకం...

రాజకీయాలలో నాయకులకి సింపతీ చాల ముఖ్యమైనది. అయితే ఏపీ లో ఎన్నికలు ముగిసి ఆరు మాసాలు పూర్తయ్యాయి. ఈ ఆరు మాసాల్లో జగన్ పాలనపై ప్రజల్లో చాలా వ్యతిరేకత వచ్చిందని - టీడీపీకి ఓట్లు వేయకుండా తప్పు చేశామని ప్రజలు భావిస్తున్నారని చంద్రబాబు పదే పదే అనేక పర్యటనల్లో చెప్పుకొచ్చారు. జగన్ కు ఎందుకు ఓటు వేసామా అని ప్రజలు తలలు బాదుకుంటున్నారని చంద్రబాబు చెప్పిన విషయం కూడా తెలిసిందే.

ప్రస్తుతానికి ఇది నిజమే అనుకుందాం. ఈ ఆరు నెలల్లో జగన్ పై ద్వేషం పెరిగి.. బాబుపై ప్రేమ పుట్టిందనుకుందాం. కానీ గ్రౌండ్ లెవల్లో నుంచి చుస్తే అలాంటిదేమి లేదు. తాజాగా చంద్రబాబుపై అమరావతిలో రాళ్లు పడ్డాయి. ఆ వెంటనే ఒకటో రెండో చెప్పులు కూడా పడ్డాయి. ఒకవేళ బాబు పై ప్రజల్లో విపరీతమైన సింపతీ పెరిగిపోయి ఉంటే తాజాగా అమరావతిలో బాబుకు జరిగిన ఘోర అవమానంపై ప్రజలు ఎందుకు స్పందించలేదు..? కనీసం పార్టీ నాయకులూ కూడా ఏ జిల్లాలో ఈ ఘటనపై వైసీపీ మీద వ్యతిరేక స్పందన కూడా వినిపించలేదు. మొత్తానికి చెప్పేది ఏమిటంటే వైసీపీ పాలన మీద టీడీపీ నేతలు సృష్టించిన పుకార్లు తప్పా, ప్రజలకు వైసీపీ మీద ఏ మాత్రం నమ్మకం చెదరలేదు, అలాగే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు మీద ఏ విధమైన సింపతీ పెరగలేదు.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.