ప‌హిల్వాన్‌ మూవీ రివ్యూ

 • విడుదల తేదీ : సెప్టెంబరు 12, 2019
 • నటీనటులు : కిచ్చా సుధీప్,సునీల్ శెట్టి, ఆకాంక్ష సింగ్,సుశాంత్ సింగ్ తదితరులు.
 • దర్శకత్వం : కృష్ణ
 • నిర్మాత‌లు : స్వప్న కృష్ణ
 • సంగీతం : అర్జున్ జ‌న్యా
 • ఎడిట‌ర్‌ : రూబెన్‌
 • స్క్రీన్ ప్లే : కృష్ణ ,డి ఎస్ కణ్ణన్, మధో
 • రేటింగ్: 2.5
 • కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ హీరోగా ఎస్‌.కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం ‘ప‌హిల్వాన్‌’. బాలీవుడ్ న‌టుడు సునీల్ శెట్టితో పాటు ఆకాంక్ష సింగ్ కీల‌క పాత్ర‌ల్లో నటించిన ఈ చిత్రానికి అర్జున్ జ‌న్యా సంగీతం అందించగా క‌రుణాక‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. కాగా ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

  కథ : ‘ప‌హిల్వాన్‌ కృష్ణ’ (కిచ్చా సుదీప్) ఓ అనాధ. అయితే ఎదుటివారి కోసం పోటీలో నిలిచి గెలిచే తత్త్వం ఉన్న కృష్ణను చూసి సర్కార్ (సునీల్ శెట్టి) చిన్నప్పుడే అతన్ని తన ఇంటికి తీసుకొచ్చి కన్న కొడుకులా పెంచి కుస్తీ వీరుడిగా తీర్చిదిద్దుతాడు. దేశం తరుపున మెడల్ సాధించాలనే తన ఆశయాన్ని కృష్ణ ద్వారా తీర్చుకోవాలనుకుంటాడు. దాని కోసం ప్రేమ పెళ్లి లాంటివి కృష్ణ జీవితంలో ఉండకూడదని సర్కార్ బలంగా కోరుకుంటాడు. కానీ ఈ క్రమంలో ‘ప‌హిల్వాన్‌ కృష్ణ’ రుక్మిణీ (ఆకాంక్ష సింగ్)తో ప్రేమలో పడతాడు. ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ‘కృష్ణ’ రుక్మిణీ పెళ్లి చేసుకుంటాడు. అది ఇష్టం లేని సర్కార్, ఇక కుస్తీని జీవితంలో మర్చిపోమని కృష్ణను దూరం పెడతాడు. అయితే ఆ తరువాత జరిగిన కొన్ని సంఘటనల వల్ల ‘కృష్ణ’ మళ్లీ ‘ప‌హిల్వాన్‌’ ఎలా మారాడు ? సర్కార్ మరియు కృష్ణ మళ్లీ కలిశారా ? ఇంతకీ ఒక కుస్తీ వీరుడు బాక్సింగ్ రింగ్ లోకి ఎందుకు దిగాడు ? ‘ప‌హిల్వాన్‌ కృష్ణ’ బాక్సింగ్ లో గెలిచాడా ? తన ఆశయం నెరవేర్చుకున్నాడా ? లేదా ? లాంటి విషయాలు తెలియాలంటే వెండితెర పై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

  విశ్లేషణ: గతేడాది కన్నడం నుంచి వచ్చిన కేజీఎఫ్ సినిమా భారీ హిట్ అయ్యింది. ఆ సినిమా తరువాత అక్కడి నుంచి భారీ సినిమాలు రావడం మొదలయ్యాయి. గతంలో ఏవో కొన్ని సినిమాలు మాత్రమే బయట భాషల్లో డబ్బింగ్ చేసుకునేవి. కానీ, కేజీఎఫ్ తరువాత భారీ సినిమాలు తీస్తూ వాటిని తెలుగు, హిందీ భాషల్లో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఈ తరహాలోనే పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన పహిల్వాన్ సినిమా రిలీజ్ అయ్యింది. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో వచ్చిన సినిమా కాబట్టి అందులో ఉండాల్సిన మలుపులు, స్పోర్ట్స్, డ్రామా అన్ని ఉంటాయి. పహిల్వాన్ సినిమాలో వీటితో పాటు సెంటిమెంట్ కూడా ఎక్కువైంది. ఈ సెంటిమెంట్ కారణంగా సినిమా కొంత పక్కదోవ పట్టింది. సుదీప్ హీరోయిజం చుట్టూనే సినిమా నడిచింది. కన్నడంలో సుదీప్ సార్ నటుడు కాబట్టి వర్కౌట్ అవుతుంది. తెలుగులో సుదీప్ విలన్ రోల్స్ చేశారు. సో, ఆయన్ను ఎలా రిలీజ్ చేసుకుంటారు అన్నది తెలియాలి.

  స్పోర్ట్స్ డ్రామాలో దానికి తగిన ఎమోషన్స్ ఉన్నట్టయితే సినిమా వేరుగా ఉంటుంది. ఈ ఎమోషన్ ను పండించడంలో దర్శకుడు కృష్ణ కాస్త తడబడ్డాడు. ఇది సినిమాకు మైనస్ గా మారింది. తమ్ముడు, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయిలానే క్లైమాక్స్ ను అద్భుతంగా తీశారు. సినిమాకు క్లైమాక్స్ ఒక్కటే బాగుంటే సరిపోదు కదా.. సెకండ్ సెంటిమెంట్ సన్నివేశాలను కాస్త తగ్గించి స్పోర్ట్స్ ఎమోషన్ ను మిక్స్ చేసినట్టయితే బాగుండేది. కిచ్చ అభిమానులకు, మాస్ ప్రేక్షకులకు ఇది ఫుల్ మీల్స్ అని చెప్పాలి.

  సాంకేతిక విభాగం : సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. ముందు చెప్పుకున్నట్లుగానే దర్శకుడు కృష్ణ కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో మెప్పించే ప్రయత్నం చేసినా, పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథా కథనాన్ని మాత్రం రాసుకోలేదు. ఇక కరుణాకర్ సినిమాటోగ్రఫీ బాగుంది. కుస్తీ సన్నివేశాల్లో అలాగే క్లైమాక్స్ లో వచ్చే దృశ్యాలన్నీ ఆయన చాలా బాగా చూపించారు.

  ఇక సంగీత దర్శకుడు అర్జున్ జ‌న్యా అందించిన నేపథ్య సంగీతం బాగున్నా… పాటలు మాత్రం పూర్తిగా ఆకట్టుకోవు. రూబెన్ ఎడిటింగ్ బాగుంది. నిర్మాత స్వప్న కృష్ణ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి.

  ప్లస్ పాయింట్స్ :

 • సుదీప్
 • సునీల్ శెట్టి

 • మైనస్ పాయింట్స్ :

 • సెకండ్ హాఫ్ లో సెంటిమెంట్ సీన్స్
 •  
   

  0 Comments

  Write a comment ...
  Post comment
  Cancel
   Please submit your comments.