స్పష్టత లోపించిన నాయకుడు, పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ ని ఎవరన్నా ఏమాత్రం సున్నితంగా విమర్శించినా వెంటనే ఎక్కువగా రియాక్ట్ అవుతాడు. ఆయన వెంటనే, నేను వేల కోట్లు వదులుకొని వచ్చాను, నాకు ప్రధాన మంత్రి దగ్గర నుంచి అందరు తెలుసు అని మొదలు పెడతాడు. అయ్యా విషయం అది కాదు. మీరు రాజకీయాలలోకి వచ్చిన తర్వాత కొంత స్పష్టత అవసరం. మీ నిజాయతీని ఎవరూ శంకించటం లేదు స్వామి. మీరు ఫుల్ టైం రాజకీయలలో ఉండాలంటే, మిమ్మల్ని నమ్ముకుని లక్షలమంది రోడ్డు మీదకు వచ్చినతర్వాత, నిజాయతీ ఒక్కటే సరిపోదు- నిబద్ధత కూడా కావాలి.

సంస్థాగతంగా పార్టీని పటిష్ట పరిచే పనులు ఎక్కడా ఎవ్వరికి తెలియదు. మీరు సీక్రెట్ గా చేస్తే అది వేరే విషయం అనుకోండి. ఇంతవరకు విధాన పరమైన ఒక ప్రకటన ఒక వ్యాసం రూపంలో గాని ఒక పుస్తక రూపంలో గాని ఎక్కడా చూడలేదు . ఇది కూడా మీరు సీక్రెట్ గా చేస్తే అది వేరే విషయం అనుకోండి. ప్రజలకు మీమీద మంచి అభిప్రాయం ఉంది కానీ అది సరిపోదు సారూ. మీరు ప్రజలకి ఒక విశ్వాసం కల్పించాలి, మంచితనం ఒక్కటే సరిపోదు. ఎన్నికలకు ముందు 6 నెల్ల క్రితం ప్రజల్లోకి వచ్చినప్పుడు, వాళ్ళు మీకు బ్రహ్మ రధం పట్టారు. కానీ మీరు 6 నెలల్లో ఎన్నోపిల్లిమొగ్గలు. ఒక రెండు వారాలు ప్రజల్లో ఉంటారు, ప్రజలందరూ మీగురుంచి మంచిగా ఆలోచించటం మొదలు పెట్టగానే మీరు ఒక నెల అంతర్ధానమైపోతారు. సరేలే అని సర్దిపెట్టుకొని ముందుకెళదాం అనుకొంటే అదేతంతు రిపీట్ అవుతూ వచ్చింది.

మీరు చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా, జగన్ కి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ప్రజలంతా మనకి ఒక ఆల్టర్నేట్ వచ్చాడు అనుకొన్నారు. మీ మనసులో ఏముందో తెలియదు కానీ, ఎన్నికల చివరి క్షణంలో మీరు జగన్మోహన్ రెడ్డి ని తిడుతూ, టీడీపీ ని ఏమనకుండా ఉంటే ప్రజలు అంత తెలివి లేని వాళ్ళు కాదు. మిమ్మల్ని, మీ అన్నయ్యను నమ్ముకొని ఎంతోమంది అభాసుపాలయ్యారు. అది మీ జన్మ హక్కుఅనుకోవద్దు. ప్రజలకి ఒక స్పష్టత ఇవ్వండి ఇప్పటికైనా. రెండు చోట్ల పోటీచేసి దారుణంగా ఓడిపోతే ఇంతవరకు మీరు ఆత్మావలోకనం చేసుకున్నట్లే మాకు కనిపించడంలేదు.

 
 

1 Comments

Write a comment ...
Post comment
Cancel
 1. 30 Aug, 2:46 pm
  Jeevan
  Reply

  Oka pani chedam. Jagan ni cbn ni pawan ni valu iche hamilu enti ani rasi ivamandam. Evaru mata marchakunda chestaro chudam chepindhi. Ysrcp ennikala hamilu iche apudu oka alaka nera verche apudu inko laga matlade valaki vundha spashatha

  Post comment
  Cancel
 

Most Viewed

సోనీ నుండి విడుదలైన ఆండ్రాయిడ్‌ వాక్‌మన్‌ ప్లేయర్‌

రక్తం పెరగాలంటే..ఈజీ చిట్కాలు

డిస్కో భామ పాయల్ రాజ్‌పుత్ హాట్ హాట్ స్టిల్స్

మున‌గాకు లాభాలు తెలిస్తే.. వెంట‌నే తింటారు..!

మధుమేహానికి దివ్యౌషధంగా పని చేసే ఆవాలు

గర్భిణులు అమెరికాకి రావద్దు.. ట్రంప్ వింత ఆలోచనతో కొత్త నిర్ణయం

వెల్లుల్లిని ప్రతిరోజు ఉపయోగిస్తే.. ఇన్ని ఉపయోగాలా?

తాగొచ్చి.. లోకేష్ ని కొట్టడానికి ప్లాన్ వేసిన మంత్రులు:యనమల

తెలుగు రాష్ట్రాల్లో రైల్వేకి సంక్రాంతి ఆదాయం ఎంతంటే..

చంద్రయాన్-3 మిషన్‌కు శ్రీకారం

2025 నాటికి ప్రపంచంలో నెంబర్ వన్ గా...

ప్రజాస్వామ్య సూచిక.. భారత్ లో దిగజారిన పౌర స్వేచ్ఛ

లైన్ లో రెండు ఉన్నాయి.. మూడో దానికి గ్రీన్ సిగ్నల్

అందంగా ఉన్న రోజా.. బాలయ్య ఆమెకు దిష్టిబొమ్మ.. వర్మ ట్వీట్

అమరావతిలో వందల ఎకరాల భూములు కొన్నపేదలపై సిఐడి కేసులు

ఫిబ్రవరి 2న విజయవాడలో జనసేన లాంగ్‌మార్చ్‌

ప్రియుడిని చంపి శవాన్ని తింటూ వీడియో తీసిన పోర్న్ స్టార్

ఇకనుండి 'మాల్స్' 24 గంటలూ ఓపెన్: కేబినెట్ ఆమోదం

పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ షూటింగ్ వీడియో లీక్..

హైదరాబాద్ కి చేరిన చైనా వైరస్?