ప్రముఖ సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, వైసీపీ తరపున తనకు ఏ పదవి కావాలని మొన్నటి ఎన్నికలకు ముందే తనను అడిగారని, జగన్ సీఎం అయితే చాలు, తనకు ఏ పదవీ వద్దని చెప్పానని పోసాని అన్నారు. కొంతమంది పదవులు ఇష్టపడతారని, ఎగబడి పదవులు తీసుకునే అలవాటు తనకు లేదని స్పష్టం చేశారు.
‘నాకు మీసాలు వచ్చిన తర్వాత నాకై నేను ఎప్పుడూ, ఎవరినీ, ఏదీ ఇంత వరకూ అడుక్కోలేదు. సినిమా ఇండస్ట్రీలో గానీ, ఉద్యోగం విషయంలో గానీ, మరోచోట గానీ నేను ఎవ్వరినీ బెగ్గింగ్ చేసిందే లేదు. ‘ఎవరైనా ఈ పని నువ్వు చేస్తే బాగుంటుంది మురళి. ఇది నువ్వు చేసి పెట్టవా, ఇది నువ్వు చెయ్యవా’ అని అడిగితే తాను తప్పకుండా చేస్తానని అన్నారు. అంతేగానీ, ఎగబడి ఫలానా పని తాను చేస్తానని అడగడం, సిఫారసులు చేయించుకోవడం తనకు చేతగాదని స్పష్టం చేశారు. నిజాయతీగా ఫలానా పని తాను చేయగలనని నమ్మి అప్పగించే పనులను, ప్రజలకు, ప్రభుత్వానికి ఉపయోగపడే పనులను అప్పగిస్తే చేయగలనని తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
Please submit your comments.