ఓ తెలుగువాడి గోడు

డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య స్థాపించిన ఆంధ్ర బ్యాంకు ఇక ఉండదు అనేది వినటానికి, జీర్ణించుకోవటానికి చాలా కష్టంగా వుంది. 1923 లో స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తి లో భాగంగా ఆంధ్ర బ్యాంకు స్థాపించబడింది. గాంధీజీ కి అత్యంత ఆప్తుడైన పట్టాభి గారు గాంధీజీ ఇచ్చిన పిలుపుని అక్షరాలా అమలుచేసే పనిలోనే ఈ బ్యాంకు స్థాపనకు పూనుకున్నారు. స్వాతంత్ర ఉద్యమమంటే కేవలం నిరసన తెలపటమేకాదు దేశ నిర్మాణానికి పాటుపడాలనే పిలుపుతోనే 1910 లో ఆంధ్ర జాతీయ కళాశాల ను స్థాపించటం ఆ తర్వాత కృష్ణ కోపరేటివ్ సెంట్రల్ బ్యాంకు ని , దాని తర్వాత ఆంధ్ర బ్యాంకు ని, ఆంధ్ర ఇన్సూరెన్సుకంపెనీ ని, భారత లక్ష్మి బ్యాంకు ని, హిందుస్థాన్ ఐడియల్ ఇన్సూరెన్స్ కంపెనీ ని స్థాపించారు. పట్టాభి గారు దేశ భక్తి ని నిర్మాణాత్మక కార్యకలాపాలకు మళ్లించటం లో ప్రముఖపాత్రని పోషించారు.

అలాగే ఆంధ్ర బ్యాంకు పెట్టిన కొత్తలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అప్పుడు మచిలీపట్టణం లో వున్న బ్రిటిష్ వాళ్ళ ఇంపీరియల్ బ్యాంకు ( ప్రస్తుత స్టేట్ బ్యాంకు కి పూర్వ రూపం) బందరు శాఖ తెల్ల దొర అయిన ఏజెంట్ ఈ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ గా ఎవరూ రాకుండా ఒత్తిడి తెచ్చాడు. ఆ నేపధ్యం లోనే పట్టాభి గారు మేనేజింగ్ డైరెక్టర్ పదవి చేపట్టటం జరిగింది. ఆ తర్వాత కూడా ఆంధ్ర బ్యాంకు కు ఎన్నో ఇబ్బందులు సృష్టించాడు. అయినా ధైర్యంతో బ్యాంకు ని పట్టాభి గారు ముందుకు తీసుకెళ్లారు. ఇంతటి స్ఫూర్తి తో ప్రారంభించి, నడిపిన పట్టాభి గారు బ్యాంకు 25 సంవత్సరాల రజతోత్సవ సందేశమిస్తూ సంస్థకి ప్రారంభం ఉంటుంది గానీ అంతం ఉండదని సెలవిచ్చారు. కానీ ఇప్పుడాయన మాట తప్పని మన ప్రభుత్వం చెబుతుంది. సంస్థ ప్రారంభం మీ చేతుల్లో వున్నా అంతం మా చేతుల్లో ఉందని చెబుతుంది. పట్టాభి గారు ఈ పరిస్థితి ని ఊహించలేదు కాబట్టే ఆ కొటేషన్ ఇచ్చారు. పట్టాభి గారూ, మీ మాటను నిలబెట్టలేకపోతున్నందుకు మా తెలుగు వాళ్లందరినీ క్షమించమని వేడుకుంటున్నాము. మేము మాట మీద నిలబడే వాళ్ళం కాదు గదా. ఇందిరా గాంధీ పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన మాటకే విలువలేదు. మీరు సందేశమిస్తే నిలబెడతామా? మీ మాట కి విలువివ్వనందుకు, మీ ఆత్మని క్షోభ పెట్టినందుకు మమ్మల్ని క్షమించండి. మేము ప్రతి సమావేశం లోనూ మీ ఫోటో పెట్టి దండ వేయగలుగుతున్నాము గానీ మీ మాటను కాపాడలేకపోతున్నందుకు మమ్మల్ని ఆక్షేపించకండి. మాకంత సామర్ధ్యం లేదని రోజు రోజుకూ నిరూపించుకుంటున్నాము. మాది అసమర్ధుని జీవనయాత్రలాగే వుందండి . ఏమిచేయగలము. మీరు కలలు గన్న రాజకీయ వ్యవస్థ సామాన్యుడి గోడు వినటంలేదండి. స్వాతంత్ర సమరయోధులందరూ కలలుగన్న సమాజం, వ్యవస్థ ఎక్కడో గాడి తప్పింది. అందుకే చివరగా మరొక్కసారి క్షమించమని పాదాలమీద పడి వేడుకుంటున్నాం. అదొక్కటే మేము చేయగలం.

ఇక మన ప్రపంచం లోకి వద్దాం. తెలుగు వాడు పెట్టిన బ్యాంకు , తెలుగు వాళ్ళు స్వంతం చేసుకున్న బ్యాంకు , తెలుగు వాళ్ళ గుండెల్లో అనుభూతిని నింపిన బ్యాంకు ఇంకొద్దిరోజుల్లో కనుమరుగవుతుంది. ప్రాంతీయ అస్తిత్వం కోసం నాలుగు బ్యాంకులను విలీనం చేయటం లేదని చెప్పిన తెలుగింటి కోడలు కు తెలుగు వాళ్ళ అస్తిత్వం గుర్తుకు రాకపోవటం బాధాకరమైన విషయం. ఆ నాలుగు బ్యాంకులు నాలుగు విభిన్న సంస్కృతులకు చిహ్నమని అట్టిపెట్టటాన్ని మనసారా స్వాగతిస్తున్నాము. మనది భిన్నత్వం లో ఏకత్వం కదా. మరి తెలుగు వాళ్ళ భిన్నత్వం గుర్తించదగినంతది కాదా? పాపం పట్టాభి గారు ( ఆయనను ఈ ఊబి లోకి తీసుకు రావద్దని అనుకుంటూనే మరల మరలా లాగుతూనే వున్నాము) మన గ్రామాల్లోని వ్యవసాయదారుల్ని , పట్టణాల్లోని వ్యాపారస్తులను సమ దృష్టి తో చూసి బ్యాంకు లో సేవలు అందించాలని భావించి గ్రామ శాఖలకు ప్రాధాన్యమిచ్చారు. అందుకే తెలుగు ప్రజల్లో అంత అభిమానం గూడు కట్టుకుంది. సరే తెలుగు వాళ్లకు గుర్తింపు అవసరం లేదని , ఆ విషయం ఇప్పటికే బోధపడిందని సరిపెట్టుకుందాం.

మరి హైద్రాబాదు లాంటి పెద్ద మెట్రో నగరానికి ఒక్క ప్రధానకార్యాలయం వున్న బ్యాంకు కూడా అవసరం లేదా? ఇప్పుడు ప్రతిపాదించిన 12 బ్యాంకుల ప్రధానకార్యాలయాలు ఎక్కడున్నాయో తెలుసా? నాలుగు ముంబై లో, రెండు ఢిల్లీ లో, రెండు చెన్నై లో, కలకత్తా , బెంగళూరు , వడోదర , పూణే లలో ఒక్కొక్కటి వున్నాయి. మరి బెంగళూరు తో సమానంగా వున్న హైద్రాబాదు లో ఒక్కటికూడా అవసరం లేదా? ఇందులో మా తెలుగువారి గుర్తింపుని గురించి మాట్లాడటం లేదు. దేశం నాలుగు దిక్కులా ప్రధాన కార్యాలయాలు పెట్టి మధ్య భారతానికి ఒక్క కార్యాలయం కూడా అవసరం లేదా? ఇది జాతీయ దృక్పధం అవుతుందా? కనీసం ఈ కారణంతోనైనా హైద్రాబాదు కి ఓ ప్రధాన కార్యాలయం వున్న జాతీయ బ్యాంకు అవసరం లేదా? గౌరవనీయులైన ఆర్థికమంత్రిగారూ, తెలుగువారి గౌరవము , ఆత్మ గౌరవం సంగతి పక్కన పెట్టినా జాతీయ దృక్పధంతో హైద్రాబాదు మెట్రో నగరానికి ఒక ప్రధాన కార్యాలయం అట్టిపెట్టటానికైనా మా ఆంధ్రా బ్యాంకు కార్యాలయాన్ని హైద్రాబాదు లో ఉంచండి మేడమ్ . ఇవన్నీ కుదరకపోతే ఈ విలీన బ్యాంకు ప్రధాన కార్యాలాయాన్నయినా హైద్రాబాదు లో ఉంచండి మేడం. ఇది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నది కాకపోయినా మాకు ఈ విలీనాన్ని ఆపటం చేతకాకపోతే చావు దప్పి కన్ను లొట్ట పోయినట్టు ఇదైనా చేస్తే కొంతలో కొంత ఉపశమనం మేడం, అదీ అందరికీ ఆమోదయోగ్యమైన కొత్త పేరుతో . ఇది మా చివరి ఆప్షన్ మాత్రమే. నేనీ మాట అన్నందుకు మా మిత్రులందరికీ కోపం వస్తుందని తెలుసు, కానీ నాకున్న అంచనాతో మాట్లాడినందుకు అందరూ నన్ను క్షమిస్తారని భావిస్తూ

భవదీయుడు ఓ తెలుగు వాడు/ ఓ తెలుగు గోడు

By తేజ

 
 

1 Comments

Write a comment ...
Post comment
Cancel
 1. 4 Sep, 12:02 pm
  Rajesh Kumar
  Reply

  test

  Post comment
  Cancel
 

Most Viewed

ఇక యుద్ధం జరిగేది జగన్-పవన్ మద్యే..!

జగన్ పాలన బాగుంటే సినిమాలు చేసుకుంటా అన్నవుగా..తథాస్తు!

అభివృద్ధి రానప్పుడు..మారిస్తే, కంగారెందుకు?

జగనన్న గోరుముద్ద.. రోజుకో రకం భోజనం.. వైరల్ అవుతున్న మెనూ!

సరిలేరు నీకెవ్వరు మూవీ సరికొత్త రికార్డు

ఈరోజు రాత్రి అత్యవసర భేటీ.. మంత్రులకు సీఎం ఆదేశం

దొంగతనం చేస్తూ.. అడ్డంగా దొరికిపోయిన పోలీస్.. వైరల్ వీడియో

ఐటీఐలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం...

మళ్ళీ పవన్ కి సెటైర్ వేసిన ఆర్జీవీ!

వైసీపీ నేతలకి తలనొప్పిగా మారిన మూడు రాజధానుల బిల్లు

వైజాగ్ వద్దు, ఈసారికి విజయవాడ: జగన్ సర్కార్

ఇండియా పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ స్టార్ హీరో..!

అప్పుడు చంద్రబాబు.. ఇప్పుడు జగన్.. రియల్ ఎస్టేట్ మాఫియా

హాట్ హాట్ ఫోటోలతో.. సురేఖావాణి రచ్చ!

RRR అప్డేట్: రంగంలోకి బాలీవుడ్ సూపర్ స్టార్

తెలంగాణాలో మున్సి‘పోల్స్’.. ప్రత్యేక ఏర్పాట్లు

అసెంబ్లీ సమావేశాలలో చంద్రబాబుపై విమర్శల దాడి పెంచిన వైసీపీ

టీడీపీకి మరో కీలక నేత రాజీనామా..?

జగన్, చంద్రబాబుల ఆసక్తికర సంభాషణ

అంతా.. నువ్వే చేసావు.. చంద్రబాబు!