ఎన్టీఆర్ ప్రారంభించారు, జగన్ ముగించారు

గ్రామ సచివాలయాల, వార్డ్ స్థాపన ఇంతవరకు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని ఆలోచన. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 1987 తర్వాత ఇంత పెద్ద సంచలనాత్మక నిర్ణయం తీసుకోవడం ఇదే మొదటిసారి కావడం విశేషం. 'ప్రజల వద్దకు పాలన' అనే నినాదం అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు జగన్ గారు ఆచరణాత్మకంగా చూపించారు. ఎన్టీఆర్ గారు 1987 లో పాలనను మండలాలకు తీసుకొస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ గ్రామాల వరకు తీసుకొచ్చినట్లుగా చెప్పవచ్చు. అంతేకాదు ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరిగేబదులు ఉద్యోగస్తులే ప్రజలవద్దకు వచ్చే విధంగా గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశ పెట్టటం ఓ విప్లవాత్మకమైన చర్యగా చెప్పొచ్చు.

గ్రామ సచివాలయం, వార్డు, గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ప్రజల రోజువారీ అవసరాలు తీర్చటంలో ఎంతో ఉపయోగపడుతుంది. 34 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల సమాచారాన్ని గ్రామా సచివాలయం లో అందుబాటులో ఉంచుతారు. దాదాపు 500 సేవలను ఈ గ్రామ సచివాలయం ద్వారా ప్రజలకు అందించే విధంగా ప్రణాళిక రూపొందించారు. ప్రజలకు ఉన్న సమస్యలను ధరఖాస్తు చేసుకున్న వెంటనే తీర్చే విధంగా 47 సేవలు, ధరఖాస్తు చేసుకున్న 72 గంటలలోపు 148 సేవలను, మిగిలిన 311 సేవలను 72 గంటల తరవాత పొందుకునే విధంగా ఈ వ్యవస్థను రూపొందించారు. డిసెంబర్ 1 కి పనిచేయడం ప్రారంభించాలని, 2020 జనవరి 1 నుండి 500 రకాల సేవలను అందించే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. సచివాలయంల్లో ప్రతి రోజు స్పందన కారక్రమాన్ని నిర్వహించనున్నారు. గ్రామం నుండి రాజధాని వరకు ఏ సమస్యనైనా ఫిర్యాదు చేసుకునే విధంగా 1902 అనే టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ విధంగా జగన్ ప్రభుత్వం అటు నవరత్నాలను అమలు చేస్తూనే, ఇటు వైస్సార్ సీపీ మేనిఫెస్టోను అమలు చేస్తున్నారు.

"పల్లెలు దేశానికి పట్టు కొమ్మలు", "ప్రజల వద్దకు పాలన" అనే నినాదాలు ఇప్పటి వరకు పుస్తకాలలో చదివే వాళ్ళం, కొంత మంది పెద్దమనుసుల ఉపన్యాసాల్లో వినే వాళ్ళం కానీ ఎన్టీఆర్, జగన్ వంటి ముఖ్యమంత్రుల పుణ్యమా అని ఈ విధంగా ఆచరణలో చూస్తున్నాం. అన్ని ప్రభుత్వాల్లో తప్పులు ఉంటాయి, ఒప్పులు ఉంటాయి, తప్పటడుగులు ఉంటాయి కానీ తప్పుని తప్పుగా, ఒప్పును ఒప్పుగా చూసేవాడే ఉత్తముడు.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.