డ్రాప్ అయిన కథానాయకుడు కలెక్షన్స్

'ఎన్టీఆర్ కథానాయకుడు' బుధవారం నాడు భారీ అంచనాల నడుమ విడుదలయింది. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్డ్ రెస్పాన్స్ రావడంతో మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఏడున్నర కోట్ల రూపాయల షేర్ సాధించింది. రెండో రోజుకు పరిస్థితి మరింతగా దిగజారింది. తెలుగు రాష్ట్రాలలో కోటి ఇరవై లక్షలు కూడా వసూలు చేయలేకపోయింది.

నిన్న రజనీకాంత్ సినిమా 'పేట' రిలీజ్ అయినప్పటికీ 'ఎన్టీఆర్ కథానాయకుడు' థియేటర్ల సంఖ్య పెద్దగా తగ్గలేదు. కానీ ఎన్టీఆర్ బయోపిక్ కలెక్షన్స్ మాత్రం చాలా నిరాశాజనకంగా ఉన్నాయి. చాలా చోట్ల థియేటర్ రెంట్ కు సరిపడినంత మాత్రమే వసూళ్లు రాబడుతోంది అంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ భారీస్థాయిలో జరిగింది కాబట్టి ఈ రేంజ్ కలెక్షన్స్ బయ్యర్లకు.. డిస్ట్రిబ్యూటర్లకు ఆందోళన కలిగించేవే.

ఏపీ.. తెలంగాణా రాష్ట్రాల్లో రెండు రోజులుగానూ 'కథానాయకుడు' వసూలు చేసిన ఏరియా వైజ్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.
  • నైజాం: 2.18 cr
  • సీడెడ్: 0.96 cr
  • ఉత్తరాంధ్ర: 0.97 cr
  • ఈస్ట్: 0.49 cr
  • వెస్ట్: 0.64 cr
  • కృష్ణ: 0.86 cr
  • గుంటూరు: 2.14 cr
  • నెల్లూరు: 0.57 cr
 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.