‘నిశ్శబ్ధం’ మూవీ ఫస్ట్ లుక్ రెలీజ్

భాగమతి సినిమా తర్వాత అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘నిశ్శబ్ధం’. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పూర్తి షూటింగ్ యూఎస్ లోనే జరుపుకుంటుంది. ప్రస్తుతం చిత్రీకరణ తుదిదశకు చేరుకున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది చిత్రయూనిట్.

దీనిలో భాగంగానే ఈ రోజు ఈ సినిమాలోని అనుష్క ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ‘సాక్షి’ అనే ఒక చిత్రకారిణిగా ఈ పోస్టర్లో ఆమె కనిపిస్తోంది. అనుష్క లుక్ డిఫరెంట్ గా ఆకట్టుకునేలా ఉంది.

కాగా ఈ సినిమాలో అనుష్కతో పాటు మాధవన్, అంజలి, షాలిని పాండే, శ్రీనివాస్ అవసరాల, సుబ్బరాజు, మైఖేల్ మ్యాడ్సన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. కోన ఫిల్మ్ కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల, కోన వెంకట్ నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపిసుందర్ సంగీతం అందిస్తున్నాడు. తెలుగు,తమిళ, ఇంగ్లీష్,మలయాళ, హిందీ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగు లో నిశ్శబ్ధం టైటిల్ తోను, మిగతా భాషలలో సైలెన్స్ టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. మరి భాగమతి మూవీ తరువాత అనుష్క నటించిన నిశ్శబ్ధం మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో కూడా అనుష్క సూపర్ హిట్ అందుకుంటుందేమో చూద్దాం.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.