నిను వీడని నీడను నేనే మూవీ రివ్యూ

నటీనటులు : సందీప్ కిషన్, అన్యా సింగ్, పోసాని కృష్ణమురళి, మురళీ శర్మ, వెన్నెల కిషోర్.
దర్శకత్వం : కార్తీక్ రాజు
నిర్మాత‌లు : దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్ర‌హ్మ‌ణ్య‌న్
సంగీతం : ఎస్.ఎస్. తమన్
రేటింగ్: 3/5

సందీప్ కిషన్ కథానాయకుడిగా నటించి, నిర్మిస్తున్న చిత్రం ‘నిను వీడని నీడను నేనే’. అన్యా సింగ్ కథానాయిక. కార్తీక్ రాజు దర్శకుడు. వెంకటాద్రి టాకీస్ , వి స్టూడియోస్, విస్తా డ్రీమ్ మర్చంట్స్ పతాకాలపై సినిమా తెరకెక్కింది. దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్ర‌హ్మ‌ణ్య‌న్ నిర్మాతలు. ఎస్.ఎస్. తమన్ సంగీత దర్శకుడు. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ అనిల్ సుంకర సమర్పణలో రూపొందిన ఈ సినిమా నేడు విడుదల ఐయ్యింది. మరి ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు విశ్లేషిద్దాం.

కథ:
ఆసక్తికరంగా ఈ చిత్రం కథ 2035సంవత్సరంలో మొదలవుతుంది.ఇద్దరు యువ స్కాలర్స్ అర్జున్ (కార్తీక్ నరేన్) మరియు మాధవి(మాళవిక నైర్) 2013లో హైదరాబాద్ లో జరిగిన ఒక కేసు విషయమై మానసిక వైద్యుడైన మురళి శర్మను కలవడం జరుగుతుంది. దాని ఆధారంగా మొత్తం కథ ఫ్లాష్ బ్యాక్ నేపథ్యంలో నడుస్తుంది.

రిషి(సందీప్ కిషన్),దియా(అన్య సింగ్) కొత్తగా పెళ్ళైన జంట. ఆనందంగా సాగుతున్న వారిజీవితంలో హైదరాబాద్ శివారు స్మశానంలో వద్ద వారి కార్ కి ప్రమాదం జరిగిన రోజు నుండి అనుకోని మలుపు తిరుగుతుంది. ఆ ప్రమాదం జరిగిన మరు దినం రిషి,దివ్యల ముఖాలు అద్దంలో అర్జున్(వెన్నెల కిషోర్)మాధవి లవలే కనిపిస్తుంటాయి.

వారి జీవితాలలో జరుగుతున్న ఈ అసహజ సంఘటల వెనుక అసలు కారణాలు తెలుసుకోవాలని రిషి ఓ మానసిక వైద్యుడు మురళీశర్మను కలువగా అతడు, దియా ను చర్చి ఫాదర్ ని కలవమని సలహా ఇస్తాడు. అలాగే మురళి శర్మ, రిషిని ఓ ఆత్మ వెంటాడుతోందని గుర్తిస్తాడు. చర్చి ఫాదర్ దియా కు 400ఏళ్ల క్రితం జరిగిన ఓ సంఘటనకు సంబంధం ఉందని గ్రహిస్తాడు. చివరిగా ఈ అసహజ సంఘటనలకు కారణం ఏమిటి,వెన్నెల కిషోర్ ఆత్మ సుందీప్ ని ఎందుకు వెంటాడుతుంది. అర్జున్,మాధవి ల మరణం వెనుక ఎవరున్నారు, అనేది తెరపైన చూడాలి.

నటీనటులు :
సందీప్ కిషన్‌ తనదైన నటనతో మరోసారి ఆకట్టుకున్నాడు. తనకు బాగా పట్టున్న కామెడీతో పాటు హారర్‌, యాక్షన్‌, సెంటిమెంట్‌ ఇలా అన్ని ఎమోషన్స్‌ను చాలా బాగా పండించాడు. అన్యాసింగ్ పాత్రలో స‌హ‌జంగా ఒదిగిపోయింది. వెన్నెల‌కిషోర్ ప్రథ‌మార్ధంలో అద్దంలో మాత్రమే క‌నిపిస్తుంటారు. కానీ ఆయ‌న క‌నిపించిన ప్రతిసారీ హాస్యం పండుతుంది. క‌థంతా కూడా ఆయ‌న పాత్ర చుట్టూనే సాగుతుంది. ద్వితీయార్ధంలో ఆయ‌న పాత్ర కూడా సెంటిమెంట్‌ని పండిస్తుంది. పోసాని కృష్ణముర‌ళి దెయ్యాలంటే భ‌య‌పడే పోలీసు అధికారిగా న‌వ్విస్తారు. ముర‌ళీశ‌ర్మ‌, ప్రగ‌తి, పూర్ణిమా భాగ్యరాజ్ త‌దిత‌రులు పాత్రల ప‌రిధి మేర‌కు నటించారు.

ప్లస్ పాయింట్స్:
క‌థాంశం
న‌టీన‌టులు
ప‌తాక స‌న్నివేశాల్లో భావోద్వేగాలు
నేపథ్య సంగీతం

మైనస్ పాయింట్స్:
లాజిక్ లేని సీన్స్
సెకండ్ హాఫ్ కామెడీ

విశ్లేషణ :
సందీప్‌ కిషన్‌ తొలిసారిగా నిర్మాతగా మారుతున్న సినిమా కోసం ఆసక్తికర కథను రెడీ చేశాడు దర్శకుడు కార్తిక్‌ రాజు. సినిమా మీద ఉన్న అంచనాలకు తగ్గట్టుగా ఇంట్రస్టింగ్ పాయింట్‌తో సినిమాను స్టార్ట్ చేశాడు. అయితే కీలకమైన మలుపులన్ని ద్వితీయార్థంలో చూపించిన దర్శకుడు ఫస్ట్‌హాఫ్‌లో కథను కాస్త నెమ్మదిగా నడిపించాడు. సెకండ్‌ హాఫ్‌లో అసలు కథ మొదలవుతుంది. వరుస ట్విస్ట్‌లతో ద్వితీయార్థాన్ని ఆసక్తికరంగా మలిచాడు దర్శకుడు. ముఖ్యంగా ఇంటర్వెల్‌ సీన్‌, ప్రీ క్రైమాక్స్‌, క్లైమాక్స్‌లు ఆకట్టుకుంటాయి. అయితే సినిమాలో లాజిక్‌ల కోసం వెతికితే మాత్రం కష్టం. థ్రిల్లర్‌ సినిమాలకు తమన్ ఎప్పుడూ సూపర్బ్‌ మ్యూజిక్‌తో అలరిస్తాడు. ఈ సినిమాలోనూ తమన్ తన మార్క్‌ చూపించాడు. పాటలు పరవాలేదనిపించినా నేపథ్య సంగీతంతో సినిమా స్థాయిని పెంచాడు. సినిమాటోగ్రఫి సినిమాకు మరో మేజర్‌ ప్లస్‌పాయింట్‌. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

తీర్పు:
మొత్తంగా చెప్పాలంటే నిను వీడని నీడను నేను ఆసక్తికరంగా సాగే హారర్ థ్రిల్లర్ అని చెప్పవచ్చు. థ్రిల్లర్ మూవీస్ ని ఇష్టపడే వారికీ నినువీడని నీడని నేను చిత్రం ఈ వారానికి మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.