TSRTC లో కొత్త అభ్యర్థుల నియామకం, కెసిఆర్ గ్రీన్ సిగ్నల్!

టీయస్ఆర్టీసీ లోకి కొత్త వ్యక్తులను తీసుకోబోతున్నారు. అందుకు తెలంగాణ సీఎం కెసిఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రెండు రోజుల్లో లిస్ట్ తయారు చేయాలనీ అధికారులను ఆదేశించారు. సమ్మెలో ఉన్నవారిని తిరిగి విధుల్లోకి తీసుకోబోమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆదివారం సాయంత్రం వరకు ఆర్టీసీ కార్మికులకు గడువు ఇచ్చినా 1200 మినహాహించి, మిగిలిన వారు విధుల్లోకి రాకపోవడంతో టీయస్ఆర్టీసీలో దాదాపు 48000 తొలగించి ఆ ఉదోగ్యాలను నిరుద్యోగులకు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. వేల సంఖ్యలో నిరుద్యోగులు ఆర్టీసీ డిపోలకు చేరుకున్నారు. మరో వైపు ఆర్టీసీ కార్యకర్తలు ధర్నాను కొనసాగిస్తుండగా అనేకమందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఆందోళనలో కార్మికులు

మరో వైపు అఖిల పక్షం నిర్వహిస్తున్న కార్మికులు ఆందోళన చెందుతున్నారు. వేల సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు సాధ్యం కాదని, ప్రభుత్వానికి న్యాయపరంగా చిక్కులొచ్చే అవకాశం ఉందని , కార్మికులు ఆందోళన చెందాల్సిన పనిలేదని కార్మిక సంఘం నేతలు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా కొందరు మాత్రం తాజా నిర్ణయంతో కలవర పడుతున్నారు. వారు తమ డిపో మేనేజర్లకు ఫోన్‌ చేసి తమ ఉద్యోగాలు ఉంటాయా, నిజంగానే తొలగించినట్టేనే అని వాకబు చేస్తున్న ట్టు తెలిసింది. నగరంలోని ఓ డిపో మేనేజర్‌కు ఆదివారం రాత్రి పొద్దుపోయాక ఓ డ్రైవర్‌ ఫోన్‌ చేసి, ఉద్యోగం పోవటం తట్టుకోలేకపోతున్నానని, తాను ఆత్మహత్య చేసుకుంటానని పేర్కొన్నాడు. దీంతో అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని, సోమవారం వచ్చి మాట్లాడాలని, అప్పటి వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ధైర్యం చెప్పారు.

ఒకేసారి సమ్మెలో ఉన్నవారిని తిరిగి విధుల్లోకి తీసుకోబోమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. దాదాపు 48వేల మంది ఉద్యోగులపై వేటు వేసే నిర్ణయం తీసుకుంటే న్యాయపరంగా చిక్కులొచ్చే అవకాశం ఉందేమోనని అధికారులు ముందుగానే వాకబు చేశారు. సీఎం వద్దకు వెళ్లేముందే న్యాయ సలహా తీసుకున్నట్టు తెలిసింది. పర్యవసానాలను పరిశీలించిన తర్వాతనే సీఎం ఆ ప్రకటన చేసినట్టు చెబుతున్నారు.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.