తెలంగాణలో బీజేపీ కొత్త సారథి ఎవరు ...?

2023 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి తెలంగాణ గడ్డపై కాషాయ జెండా రెపరెపలాడించాలని ఉవ్విళ్లూరుతున్న కమలం పార్టీ అందుకు అనుగుణంగా ఇప్పటి నుంచే పక్కాగా ప్లాన్ సిద్దం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించి పార్టీని ఎన్నికల వరకు ఓరేంజ్ కు తీసుకెళ్లాలని టార్గెట్ పెట్టుకుంది.అయితే ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్, అమిత్ షాను కలిసి తనకే మళ్లీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని కోరినట్లు సమాచారం. రాష్ట్రంలో అంతగా పట్టు లేని బీజేపీని ఇప్పుడు ఒక దశకు తీసుకువచ్చానని తనకు మళ్లీ పగ్గాలు అప్పగిస్తే అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని తెలిపినట్లు సమాచారం. దానికి అమిత్ షా కూడా ఓకే అన్నట్లు బీజేపీ వర్గాలు తెలుపుతున్నాయి.

అయితే ఆర్ఎస్ఎస్ మాత్రం బండి సంజయ్ పేరును గట్టిగా సూచించినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి కీలక నేతలను పార్టీలోకి తీసుకువచ్చి మరింత బలోపేతం చేయగల సమర్థుడు బండి సంజయ్ అని, అతడికి పగ్గాలు ఇస్తే తెలంగాణలో బీజేపీ తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని ఆర్ఎస్ఎస్ సూచించినట్లు సమాచారం. బీజేపీ అధిష్టానం వద్ద మంచిపేరు, యువతలో ఫాలోయింగ్ ఉండటంతో సంజయ్ పార్టీ పగ్గాలు వచ్చే అవకాశం ఉందని ఆయన అనుచరులు, అభిమానులు భావిస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎప్పటికప్పుడు విమర్శిస్తూనే పార్టీకి ఎంతో పేరు తెచ్చిన బండి సంజయ్ కి బాధ్యతలు అప్పగించాలని ఆర్ఎస్ఎస్ అన్నట్లు తెలుస్తోంది.

పార్టీ అధ్యక్ష పదవి కోసం బండి సంజయ్ తో పాటు ధర్మపురి అరవింద్ కూడా పోటీ పడుతున్నట్లు సమాచారం. నిజామాబాద్ లో కవితను ఓడించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తనకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకువచ్చేందుకు శాయశక్తుల కృషి చేస్తానని అధిష్టానానికి తెలిపినట్లు సమాచారం. లేకుంటే కేంద్రమంత్రి పదవి అయినా ఇవ్వాలని పార్టీ పెద్దల వద్ద తన మనసులోని మాటను బయటపెట్టినట్లు సమాచారం.

ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన జితేందర్ రెడ్డి, డీకే అరుణ కూడా అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. జితేందర్ రెడ్డికి అధిష్ఠానం పెద్దలతో ఉన్న పరిచయం, రాష్ట్రంలోని పలుపార్టీలకు చెందిన కీలక నేతలతో సత్సంబంధాల వల్ల తనకు పదవిని అప్పగిస్తే పార్టీకి న్యాయం చేస్తానని తెలిపినట్లు సమాచారం. డీకే అరుణ కూడా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. మీడియాలో అధికార టీఆర్ఎస్ ను విమర్శించడంతో పాటు మంచి వాగ్దాటి ఉన్న నేత అయినందున ఆమె పేరును కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.
 

Most Viewed

బాలకృష్ణతో రోజా సెల్ఫీ..ఫ్రేమ్ లో చంద్రబాబు కూడా..!

జనసేన ఎమ్మెల్యే రాపాకపై శ్రీరెడ్డి కేక పోస్ట్...!

టీఆర్ఎస్ అభ్యర్థి ముక్కు కొరికిన కాంగ్రెస్ అభ్యర్థి

రోడ్ పక్కన వివస్తగా పడివున్న మహిళ.. పక్కన కాండోమ్ లు

తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్న అంత‌ర్జాతీయ సంస్థ‌లు

తెలంగాణ లో పిరామల్ గ్రూపు 500 ల కోట్ల పెట్టుబడి

ఆందోళనకరంగా ఆర్ధిక అసమానతలు

రాజధాని మార్పు పై వైసీపీ నేతల భారీ ర్యాలీ!

పవన్ కళ్యాణ్ కి తిక్క.. జగన్ కేమో...

జగన్ కి షాక్ ఇచ్చిన ప్రధాని మోడీ నిర్ణయం

ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికలు

5 పెళ్లిళ్లు చేసుకొని ట్రెండింగ్ గా మారిన 52 ఏళ్ళ హీరోయిన్

వైసీపీలోకి మరో టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత జంప్!

వైరల్ అవుతున్న ఫోటో : వైస్సార్ విగ్రహాన్ని తగలబెట్టిన వైనం

ద్యావుడా.. అల.. వైకుంఠ.. భారీ వసూళ్లు

వెంకటేష్‌ కొత్త చిత్రం ‘నారప్ప’ ప్రారంభం!

పిల్లలకి జగన్ అందిస్తున్న 4 వరాలు ఇవే..

టికెట్‌ లేని ప్రయాణికుల ద్వారా వచ్చే ఆదాయం ఎంతో తెలుసా...?

భార్యకు అమితమైన ప్రేమతో.. సూపర్ స్టార్ బర్త్‌డే విషెస్!

వైకుంఠపురం రాణి పూజ హెగ్డే బ్యూటిఫుల్ ఫొటోస్