నాని గ్యాంగ్ లీడర్ ట్రైలర్

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని కథానాయకుడిగా 'గ్యాంగ్ లీడర్' రూపొందింది. పూర్తి వినోదభరితంగా నిర్మితమైన ఈ సినిమా ద్వారా, ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా పరిచయమవుతోంది. కార్తికేయ ప్రతినాయక పాత్రను చేసిన ఈ సినిమాలో, సీనియర్ హీరోయిన్ లక్ష్మి ఒక కీలకమైన పాత్రలో కనిపించనుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

రివెంజ్ కి సంబంధించిన కథలను రాసేవాడిగా ఈ ట్రైలర్లో నాని కనిపిస్తున్నాడు. యాక్షన్ .. కామెడీ .. సస్పెన్స్ కి సంబంధించిన సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేదిగా వుంది. 'ప్రపంచంలో ఎంతటి మగాడినైనా మాయ చేయగలిగే ఒక ఒక పవర్ఫుల్ వెపన్ అమ్మాయి' అంటూ నాని చెప్పిన డైలాగ్ ఆకట్టుకునేలా వుంది. వెన్నెల కిషోర్ .. ప్రియదర్శి .. శరణ్య ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను, వచ్చేనెల 13వ తేదీన విడుదల చేయనున్నారు.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.