వెటర్నరీ వైద్యురాలి పేరు ‘దిశ’గా మార్పు

శంషాబాద్ వెటర్నరీ డాక్టరు హత్యాచారం ఘటనను ప్రతి ఒక్కరూ ఖండిస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని కొందరు అంటుంటే, మరణ శిక్ష విధించాలని మరికొంత మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా వుండగా, ఇలాంటి కేసుల్లో బాధితురాలి పేరును, వారి కుటుంబసభ్యుల పేర్లను, వివరాలను ఎక్కడా ప్రస్తావించకూడదని సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె పేరును ఖదిశగగా మారుస్తున్నట్టు సీపీ సజ్జనార్ ప్రకటించారు. ఈ విషయమై ఆమె తల్లిదండ్రుల అనుమతి తీసుకున్నట్టు చెప్పారు. ఇకపై మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో ఆమె పేరును ‘దిశ’ అని పేర్కొనాలని, జస్టిస్ ఫర్ దిశగకు అందరూ సహకరించాలని కోరారు.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.