మన్మథుడు 2 వాటన్నిటినీ కొట్టేస్తుంది..

లేటు వయసులోనూ ప్రేమకథల్లో నటించడమేంటి? ఈ వయసులో ఘాటైన పెదవి ముద్దులివ్వడమేంటి? అసలు ఆ రొమాన్స్ ఏంటి? మన్మధుడు 2 టీజర్- ట్రైలర్ రిలీజ్ కాగానే జనాల్లో సందేహాలివి. ఇవే ప్రశ్నలు అంతర్జాలంలో సామాజిక మాధ్యమాల్లో వేడెక్కించాయి. ఈ ప్రశ్నలకు 60 వయసు నాగార్జున వద్ద సమాధానం ఉందా? అంటే మొన్న ఒక ఇంటర్వ్యూలో `గీతాంజలి`లో 3 నిమిషాల లిప్ లాక్ మరిచారా? ఇప్పుడు అనుభవం వచ్చింది కదా! అని రివర్స్ పంచ్ వేశారు.

మొత్తానికి ప్రీరిలీజ్ వేదికపైనా ఇదే సంగతిని గుర్తు చేసుకుని మరీ కింగ్ ఎగ్జయిట్ అయిపోయారు. ప్రేమించడానికి వయసుతో పనేంటి? ఏ వయసులో అయినా ప్రేమించవచ్చు. ముద్దు పెట్టుకోవడానికి కూడా వయసుతో పనేం లేదు! అని సెలవిచ్చారు. లేటు వయసు ఘాటు రొమాన్స్ ఉన్న ఫ్రెంచి సినిమా తనలో ఎంతో స్ఫూర్తి నింపిందని నాగార్జున అన్నారు. అసలు మన్మధుడు టైటిల్ పెట్టడానికి కారణాన్ని వివరించారు కింగ్. ఆ టైటిలే ఎందుకు పెట్టాం అంటే... ఒరిజినల్ `మన్మథుడు` ఆడాళ్నను ద్వేషిస్తాడు. కానీ ఈ మన్మథుడు వాళ్లను లవ్ చేస్తాడు. సర్కిల్ ని ఫినిష్ చేయాలి కదా! అందుకే `మన్మథుడు 2` అని టైటిల్ సెట్ చేశామని తెలిపారు.

``ఏడాది క్రితం ఒక ఫ్రెంచ్ సినిమా చూశాను. నా వయసుకు తగ్గ సినిమా ఇది అనిపించింది. ఏ వయసులో అయినా లవ్ చేయవచ్చు. అది ఈ సినిమాలో కరెక్ట్ గా కనిపిస్తుంది``అని అన్నారు. మూవీ ఫ్లేవర్ గురించి చెబుతూ.. సినిమా ఆరంభం నుంచి ముగింపు వరకు న్వవుతూనే ఉంటాం. ఫన్ ఫన్ ఫన్... మొన్న నాగ చైతన్య `మజిలీ` సినిమాతో హిట్ కొట్టాడు. నిన్న `ఓ బేబీ` సినిమాతో మా కోడలు సమంత సక్సెస్ అందుకుంది. ఆగస్ట్ 9న `మన్మథుడు 2` వాటన్నిటినీ కొట్టేస్తుంది.. అని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఈ నెలాఖరుకి కింగ్ వయసు 30. ఆ మాట ఆయనే చెప్పారు. దీనర్థం ఆల్మోస్ట్ డబుల్ అని. 60 వయసుకు చేరువైనా కింగ్ లో ఆ జోష్ ఆశ్చర్యం కలిగిస్తోంది సుమీ!

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.