బడి పిల్లల సాక్షిగా 'నాడు - నేడు' ప్రారంభం!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో ప్రతిష్టాత్మక కారక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘నాడు-నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం రాక ముందు పరిస్థితుల్ని, ప్రస్తుత మారిన పరిస్థితుల్ని ఫొటోలు తీసి ప్రజల ముందు ఉంచుతామని జగన్‌ వెల్లడించారు. వరల్డ్ సైట్ డే సందర్భంగా అనంతపురం జిల్లా, కొత్తూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ‘వైఎస్సార్‌ కంటి వెలుగు’ పథకాన్ని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమం లో జగన్ మాట్లాడుతూ.. త్వరలోనే 'నాడు - నేడు' కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. ఆ మాటకు నిజరూపమే ఈ 'నాడు నేడు' కారక్రమం.

ఇది కూడా చదవండి: 'వైయస్ఆర్ కంటి వెలుగు' కార్యక్రమంలో జగన్ ఇంకా ఏమన్నారు?

ఆంద్రప్రదేశ్ లో నవంబర్ పద్నాలుగు నుంచి కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ఎపిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదుపాయాల మెరుగుదల కు గాను 'నాడు-నేడు' అనే కార్యక్రమం చేపడుతున్నారు. దీని ప్రకారం ఇప్పుడు ఉన్న పరిస్తితిని పోటోలో తీస్తారు. ఆ తర్వాత రెండు నుంచి నాలుగేళ్లలోపు ఆ స్కూళ్లలో ఎలాంటి మార్పులు తెచ్చింది పోటోలు చూపి ప్రజలకు తెలియచేయాలని ముఖ్యమంత్రి జగన్ ఉద్దేశంగా ఉంది.ఇందుకోసం ఏడాదికి 1500 కోట్ల రూపాయలను బడ్జెట్ ను కేటాయించారు. కాగా ఈ పనులను ప్రైవేటు కాంట్రాక్టర్ లకు కాకుండా, కమ్యూనిటీ కాంట్రాక్టింగ్ ఇవ్వాలని జగన్ ఆలోచనగా చెబుతున్నారు.దీని ప్రకారం స్థానిక ప్రజల సహకారంతో ఈ పదకాన్ని అమలు చేసి ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపర్చడానికి శ్రీకారం చుట్టాలని తలపెట్టారు.

 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.