ముందే వ‌స్తున్న 'అల వైకుంఠ‌పుర‌ములో' టీజ‌ర్‌

`నా పేరు సూర్య‌` తరువాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌… ప్ర‌స్తుతం ఏస్ ఫిల్మ్ మేక‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న‌ `అల వైకుంఠ‌పుర‌ములో`లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న‌ ఈ సినిమాలో బ‌న్నీకి జోడీగా పూజా హెగ్డే న‌టిస్తోంది. ట‌బు, నివేదా పెతురాజ్‌, సుశాంత్, న‌వ‌దీప్‌, జ‌య‌రామ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించిన టీజ‌ర్‌ను త్రివిక్ర‌మ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా న‌వంబ‌ర్ 7న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపించాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం… అంత‌కంటే ముందే అంటే ద‌స‌రాకే ఈ టీజ‌ర్‌ని విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు తెలిసింది.

గీతా ఆర్ట్స్‌, హారికా అండ్ హాసిని క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న `అల వైకుంఠ‌పురములో` 2020 సంక్రాంతికి రిలీజ్ కానుంది.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.