మిస్స‌మ్మ‌ వెబ్ సిరీస్‌ చేయనున్న భూమిక‌

హీరోయిన్‌ పాత్ర‌ల నుండి క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ వేషాల‌కు షిప్ట్ అయిన‌ నిన్న‌టి త‌రం అగ్ర క‌థానాయిక భూమికా చావ్లా… త్వ‌ర‌లో ఓ వెబ్ సిరీస్‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌నుంది. `భ్ర‌మ్‌` అనే పేరుతో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్‌లో బాలీవుడ్ న‌టి క‌ల్కి కోచ్లిన్ ప్ర‌ధాన పాత్ర‌లో క‌నిపించ‌నుండ‌గా… ఓ కీల‌క పాత్ర‌లో భూమిక న‌టిస్తోంది. ఇటీవ‌లే సెట్స్‌పైకి వెళ్ళిన ఈ వెబ్ సిరీస్… సిమ్లా ప‌రిస‌ర ప్రాంతాల్లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. సింహ‌భాగం చిత్రీక‌ర‌ణ అక్క‌డే జ‌రుగుతుంద‌ని స‌మాచారం. సంజ‌య్ సూరి, ఓంకార్ క‌పూర్‌, ఐజాజ్ ఖాన్ త‌దిత‌రులు ఈ సిరీస్‌లో ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. మ‌రి… వెండితెర‌పై న‌టిగా త‌న‌దైన ముద్ర వేసిన ఈ న‌వ‌త‌రం `మిస్స‌మ్మ‌`… వెబ్ సిరీస్‌లోనూ త‌న శైలితో ముందుకు సాగుతుందేమో చూద్దాం.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.