కీర్తి సురేష్ మిస్ ఇండియా టీజర్

నటి కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో చాలా కాలంగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ‘మిస్ ఇండియా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. సినిమాకు సంబంధించిన టైటిల్ టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

‘మహానటి’తో చిత్రపరిశ్రమలో స్టార్ హీరోయిన్ అయిపోయారు కీర్తి సురేశ్. ఈ సినిమా ఆమెకు జాతీయ అవార్డును తెచ్చిపెట్టింది. ఈ సినిమాతో మహిళా నేపథ్యంతో తెరకెక్కే సినిమాలకు కీర్తి సరిగ్గా సరిపోతారన్న నమ్మకం దర్శక , నిర్మాతల్లోనూ ఏర్పడింది. ఇప్పుడు ఆమె ‘మిస్ ఇండియా’ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తున్నారు. నరేంద్రనాథ్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ టీజర్‌ విడుదలైంది.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.