‘సైరా’ మూవీ యూత్ ఎందుకు చూడాలి?

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న చిత్రం 'సైరా నరసింహా రెడ్డి'. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. 2019లో టాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో ఇదీ ఒకటి. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అపోలో లైఫ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న చిరంజీవి కోడలు ఉపాసన బి పాజిటివ్ అనే హెల్త్ మేగజైన్ సైతం రన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 2019 సంచిక కవర్ పేజీపై ఈ సారి చిరంజీవి దర్శనమిచ్చారు. ఈ సంచికలో మెగాస్టార్ హెల్త్ అండ్ ఫిట్‌నెస్ సీక్రెట్స్ వెల్లడించారు. ఈ సందర్భంగా మామగారి నుంచి సైరా మూవీకి సంబంధించిన విషయాలు కూడా రాబట్టే ప్రయత్నం చేశారు ఉపాసన.

ఇంటర్వ్యూలో భాగంగా ‘సైరా మూవీని యూత్ ఎందుకు చూడాలి' అనే పశ్న సంధించారు ఉపాసన. దీనికి చిరంజీవి స్పందిస్తూ... ‘ఇది ఈ తరం యువత చూడాల్సిన ముఖ్యమైన సినిమా, మన కోసం మన పూర్వీకులు చేసిన త్యాగాలను గురించి చెప్పే సినిమా' అని తెలిపారు.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.