మ‌న్మ‌థుడు 2 మూవీ రివ్యూ

తారాగణం : నాగార్జున, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, వెన్నెల కిశోర్‌, లక్ష్మీ, రావూ రమేష్‌
సంగీతం : చైతన్‌ భరద్వాజ
దర్శకత్వం : రాహుల్‌ రవీంద్రన్‌
నిర్మాత : నాగార్జున, పి. కిరణ్‌
రేటింగ్ : 2.5/5

నాగార్జున,రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లు గా న‌టిస్తోన్న చిత్రం `మ‌న్మ‌థుడు 2` నేడు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలయ్యింది. రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతోన్న ఈ రొమాంటిక్ ఎంట‌ర్‌ టైన‌ర్ పై భారీ అంచనాలు ఉన్నాయి.

కథ:

పొర్చుగల్ లో తరాలుగా స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన సామ్‌ అలియాస్ సాంబశివ రావు సామ్ (నాగార్జున) తల్లి (లక్ష్మీ), అక్క (ఝాన్సీ)తో కలిసి అక్కడే స్వేచ్చా జీవితం అనుభవిస్తూ ఉంటాడు. పెళ్లి, పిల్లలు వంటి సుదీర్ఘమైన బంధాలు ఇష్టపడని సామ్ తల్లి, మరియు కుటుంబ సభ్యుల ఒత్తిడితో పోర్చుగల్ లో ఒక రెస్టారెంట్ లో పనిచేస్తున్న అవంతిక(రకుల్ ప్రీత్) ను తనను మోసగించి వెళ్లిపోయే ప్రియురాలిగా నటించమని చెవుతాడు. కొన్ని అనుకోని మలుపుల తరువాత సామ్ జీవితం తలకిందులవుతుంది. మరి అవంతిక అగ్రిమెంట్ ప్రకారం సామ్‌ ఫ్యామిలీని వదిలి వెళ్లిపోయిందా..? ప్లేబాయ్‌ లా లైఫ్‌ ఎంజాయ్‌ చేస్తున్న సామ్‌ మారాడా.. లేదా? అన్నదే మిగతా కథ.

నటీనటులు :

తన వయసును అంగీకరిస్తూ చేసిన సామ్‌ పాత్రలో నాగ్‌ సూపర్బ్ అనిపించాడు. లవర్‌ బాయ్‌లా కనిపిస్తూనే తన ఏజ్‌ను కూడా గుర్తు చేశాడు. తన మార్క్‌ రొమాంటిక్‌ సీన్స్‌లో వావ్ అనిపించిన నాగ్‌, ఎమోషనల్‌ సీన్స్‌లో కంటతడిపెట్టించాడు. ఇప్పటికీ తాను మన్మథుడినే అంటూ ప్రూవ్‌ చేసుకున్నాడు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ అద్భుతమైన పర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంది. ఇండిపెండెంట్‌ అమ్మాయిగా కనిపిస్తూనే ప్రేమ, బాధ, కామెడీ ఇలా అన్ని ఎమోషన్స్‌ను పండించింది. వెన్నెల కిశోర్‌ మరోసారి తన కామెడీ టైమింగ్‌తో కితకితలు పెట్టాడు. సినిమా అంతా హీరో వెంటే కనిపించే పాత్రలో కడుపుబ్బా నవ్వించాడు. తెర మీద కనిపించింది కొద్ది సేపే అయిన రావూ రమేష్‌ తన మార్క్‌ చూపించాడు. ఇతర పాత్రలో లక్ష్మీ, ఝూన్సీ, దేవ దర్శిని తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. అతిథి పాత్రల్లో కీర్తి సురేష్‌, సమంతలు తళుక్కుమన్నారు.

ప్లస్‌ పాయింట్స్‌ :

నాగార్జున
వెన్నెల‌కిషోర్‌ కామెడీ
కొన్ని ఎమోషనల్‌ సీన్స్‌

మైనస్‌ పాయింట్స్‌ :

కథలో కొత్తదనం లేకపోవడం
సెకండ్ హాఫ్ స్లో

సాంకేతిక విభాగం:

ఈ చిత్రం దాదాపు విదేశాల్లో చిత్రీకరించారు దీనితో కెమెరా వర్క్ తో పాటు ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి. చైతన్ భరద్వాజ్ అందించిన మ్యూజిక్ ఆహ్లాదంగా సాగింది. అలాగే పాటల సాహిత్యం మూవీ సన్నివేశాలకు తగ్గట్టుగా చక్కగా కుదిరింది. ఎడిటింగ్ మాత్రం నిరుత్సహపరుస్తుంది. మూవీలో చాలా అనవసర సన్నివేశాలున్న భావన కలుగుతుంది. అలాగే నాగ్,రకుల్ ని అందంగా చూపించడంలో కాస్ట్యూమ్ వర్క్ ఆకట్టుకుంటుంది.

చిలసౌ లాంటి చిత్రం తరువాత దర్శకుడు రాహుల్ తీస్తున్న మన్మధుడు 2 చిత్రానికి మంచి నటులతో పాటు, నిర్మాణ సంస్థ దొరికింది. కానీ రాహుల్ వీటిని ఉపయోగించుకోవడంలో విఫలం చెందాడు. మూవీకి ప్రాణమైన ఎమోషన్స్ లేకపోవడంతో చిత్రం విలువ కోల్పోయింది. నాగార్జునను ఆయన తెరపై చూపించిన విధానం, ఆయన పాత్ర రూపొందించిన తీరు మాత్రం బాగుంది. మొదటి సగం పర్లేదు అన్నట్టుగా తీసిన రాహుల్ రెండవ భాగంలో మరింతగా ప్రేక్షకులను నిరుత్సహానికి గురి చేశాడు.

తీర్పు:

మొత్తంగా చెప్పాలంటే మన్మధుడు మూవీ ప్రేక్షకుడి అంచనాలు అంతగా అందుకోలేదనే చెప్పాలి. మరీ నిరాశ పరిచే చిత్రం కాకపోయినప్పటికీ ఎక్కువగా ఆశించివెళితే నిరాశ తప్పదు.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.