లలితా జ్యూవెల్లరీ ఎండి విషయంలో ఓ ఛానల్ పై నెటిజన్లు ఫైర్!

లలితా జ్యూవెల్లరీ అధినేత కిరణ్ కుమార్ పై టీవీ9 యాజమాన్యం జోకులు వేస్తున్నారు. "గుండుబాస్ బంగారం దొరికింది" అంటూ టీవీ9 యాంకర్ అనడం, అదే మాటను పైన స్క్రోలింగ్ లో ఉపయోగించడాన్ని అనేకమంది నెటిజన్లు వ్యతిరేకించారు.

ఎంతో కష్టపడి జ్యూవెల్లరీ వ్యాపారంలో ఆగ్రగామిగా ఎదిగిన అంత పెద్ద మనిషిని పట్టుకొని గుండుబోస్ అనడం ఏంటని అనేకమంది కామెంట్స్ చేశారు. "వ్యాపారంలో విజయం సాధించడం అనుకున్నంత సులువుకాదు. దాని వెనక మనం భరించలేని కష్టాలూ, చెయ్యలేని త్యాగాలు మరియు నిధురలేని రాత్రులు ఇల చాలా ఉంటాయి ... అలాంటి పరిస్థితులగుండా వెళ్లి మంచి పేరును, ప్రఖ్యాతను సంపాదించిన వ్యక్తిని పట్టుకొని అలా అనడం ఏంటని మండిపడ్డారు. మీరు ఒకవేళ అలా కష్టపడి డబ్బు సంపాదించలేదేమో అని, మీకు ఎంతమంది చెప్పిన బుద్ధిరాదని టీవీ 9 యాజమాన్యాన్ని నిందించారు. అయినా టైటిల్ ఒకటి పెట్టి, విషయం ఇంకొకటి చెప్పే మీ లాంటి వాళ్లకు కష్టం విలువ ఏమి తెల్సిదిలే..? అని మరొకరు అన్నారు. "దొంగ దొరికాడు" అని టైటిల్ పెట్టి దొంగతనం ఎలా జరిగిందో చెప్పడం ఏంటని, కేవలం టి ఆర్ పి రేటు పెంచుకోడం కోసం ఇలాంటి చిల్లర ట్రిక్స్ ఉపయోగించడం సబబు కాదని, లలితా జ్యూవెల్లరీ అధినేత కిరణ్ కుమార్ గారిని గుండుబాస్ అని ఆయన విలువను తగ్గించడం టీవీ9 కి సరికాదని నెటిజన్లు హితవు పలికారు.

" ఆయన గుండుబాస్ కాదు జగదేకవీరుడు" "ఏమిలేని స్థితిలో తన తల్లి గాజులు అమ్మి ఎన్నో కష్టాలు పడి నేడు పదివేల కోట్ల సామ్రాజ్యానికి అధినేత అయ్యాడు, నేటి యువతరానికి ఒక స్ఫూర్తి వ్యక్తిగా నిలిచాడు" అని అనేక మంది ప్రముఖులు కీర్తించిన కిరణ్ కుమార్ గారు పై టీవీ9 వ్యంగపు మాటలా..!? అని ఫైర్ అయ్యారు నెటిజన్లు.

బుధవారం తమిళనాడు తిరుచ్చిలో లలితా జ్యూవెల్లరీ దుకాణంలో దొంతనం జరిగిన విషయం తెల్సిందే.. దొంగలు రూ .13 కోట్ల విలువైన లలిత ఆభరణాలను దొంగిలించినట్లుగా సమాచారం.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.