కేటిఆర్ ట్వీట్ కు మహేష్ బాబు రీ ట్వీట్

దోమలకారణంగా ప్రజలు డెంగ్యూ, వైరల్ ఫీవర్ వంటి పలు వ్యాధుల బారిన పడుతున్న విషయం తెలిసిందే. పరిసరాల పరిశుభ్రత లేని కారణం గా దోమలు విజృంభిస్తున్నాయి . పరిసరాల పరిశుభ్రత వల్లనే వ్యాధుల నియంత్రణ సాధ్యమవుతుందని , దానికి ప్రజల భాగస్వామ్యం అవసరమని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కేటిఆర్ అన్నారు. బహిరంగ ప్రదేశాలలో పారిశుధ్య నిర్వహణకు మున్సిపాలిటీ, GHMC అధికారులు చర్యలు తీసుకుంటున్నారని, ప్రతీ ఒక్కరూ తమ నివాస ప్రదేశాలు పరిశుభ్రం గా ఉంచుకోవాలని కేటిఆర్ సూచించారు.

దోమల వల్ల వ్యాపించే వ్యాధులను నివారించడానికి ప్రతీ ఇంటిలో పరిశుభ్రత అవసరమని కేటిఆర్ చెప్పారు. తన ఇంటిని పరిశుభ్రం చేసిన కేటిఆర్ ఆ ఫొటోస్ ను షేర్ చేసి, మీరు కూడా మీ ఇంటిని , పరిసరాలని శుభ్రం చేసిన ఫొటోస్ షేర్ చేయమని ప్రజలనుద్దేశించి ట్వీట్ చేశారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండే సూపర్ స్టార్ మహేష్ బాబు, దోమల వల్ల ప్రజలు పలు వ్యాధులకు గురవుతున్నారని, మీ ఇళ్ళ తో పాటు చుట్టుపక్కల నీటి నిల్వలు లేకుండా జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండమని కేటిఆర్ ట్వీట్ కు మహేష్ బాబు రీ ట్వీట్ చేశారు.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.