కేజీఎఫ్ ఫైట్ మాస్టర్స్ తో నాగశౌర్య

నాగశౌర్య కథానాయకుడిగా ఆయన సొంత బ్యానర్లో ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమా ద్వారా దర్శకుడిగా రమణ తేజ పరిచయమవుతున్నాడు. ఇది యాక్షన్ పాళ్లు ఎక్కువగా కలిసిన ప్రేమకథా చిత్రం. అందువలన యాక్షన్ సీన్స్ ను ఒక రేంజ్ లో చిత్రీకరిస్తున్నారు.

ఇటీవల ఒక యాక్షన్ సీన్ చేస్తూ గాయపడిన నాగశౌర్య కోలుకుని తిరిగి షూటింగులో పాల్గొంటున్నాడు. 'కేజీఎఫ్' సినిమాకి యాక్షన్ సీన్స్ ను డిజైన్ చేసిన 'అన్బు - అరివు' ఈ సినిమాకి ఫైట్స్ ను కంపోజ్ చేస్తున్నారు. యాక్షన్ బ్రదర్స్ గా పేరున్న ఈ ఇద్దరికీ ఇదే తొలి తెలుగు సినిమా. వాళ్లు కంపోజ్ చేస్తోన్న ఫైట్స్ నాగశౌర్య సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. ఈ సినిమాలో నాగశౌర్య జోడీగా మెహ్రీన్ కనిపించనుంది. త్వరలోనే ఈ సినిమా టైటిల్ ను ప్రకటించనున్నారు.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.