ఆర్టీసీ సమ్మెలో కేశవరావు కిరికిరి!

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్ధృతంగా సాగుతూ 11వ రోజుకు చేరింది. తెరాస పార్లమెంటరీ పక్ష నేత కె.కేశవరావు చర్చలు జరపాలని లేఖ రాయడంతో అది ముఖ్యమంత్రి కెసిఆర్ సూచన మేరకే ఆయన లేఖ రాసి ఉండవచ్చని ఆయన చేసిన వ్యాఖ్యలతో సమ్మెకు పరిష్కారం లభిస్తుందని అందరూ భావించారు. ఈ నేపధ్యం లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కేకే ను కలిసి రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మెతో అందరికీ నష్టం జరుగుతోందని, టీఆర్ఎస్ పార్టీ కూడా నష్టపోతుందని వెల్లడించారు. 'ముఖ్యమంత్రి ఆదేశిస్తేనే తాను ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు జరుపుతానని అంటున్నారట. ముందు లేఖ ఎందుకు రాయాలి తీరా చర్చలకు వచ్చాక కెసిఆర్ ని తెరపైకి తీసుకురావడం పై అనేకమంది విమర్శలు గుప్పిస్తున్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ నిరంకుశ పాలన సాగిస్తున్నారని.. పోలీసులతో ప్రజల గొంతును నొక్కుతున్నారని విమర్శలు చేస్తున్నారు కేసీఆర్ ఇప్పటికైనా స్పందించి సమ్మె పరిష్కారం దిశగా ఆలోచన చేయాలని డిమాండ్ చేశారు. దీంతో కేశవరావు రాసిన లేఖ ఆయన సొంతమా ? పార్టీ పరంగానా అన్నది తెలియవలసిన పరిస్థితి ఏర్పడినది ఇది ఇలా ఉండగా, వెంటనే విద్యా సంస్థలను తెరిపించాలని కోరుతూ హైకోర్టులో ఒక పిల్ పడింది.

 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.