కెసిఆర్ హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని జరపాలి

కెసిఆర్ కి నిజాం నవాబ్ అంటే వల్లమాలిన ప్రేమ. కానీ ఆ ప్రేమే తనని వాస్తవ ప్రపంచాన్ని చూడనీయటంలేదు. కెసిఆర్ స్వంత ఐడియాలు వున్న నాయకుడు.అది తనకున్న పెద్ద ఎస్సెట్ . అలాగే స్ట్రాంగ్ లీడర్ కూడా . అది తన బలమూ, బలహీనత కూడా . అవసరమైనప్పుడు గట్టి నిర్ణయాలు తీసుకోగలిగిన సత్తా వున్న నాయకుడు. ఒరిజినల్ ఐడియాస్ వుండి బలమైన నాయకుడిగా ఉండటం వలన ప్రజలకోసం గట్టి నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాడు. అది ప్రజలకు ఆ మేర మేలు జరుగుతుంది. ఇక బలహీనత ఏమిటంటే తాను నమ్మిన విషయాన్ని ప్రజలేమనుకుంటున్నారోనని ఆలోచించకుండా ముందుకు పోవటం. ఇది ప్రజాస్వామ్య సమాజం లో చేటు చేస్తుందని గ్రహించటం లేదు.

నిజాం నవాబ్ పై ప్రేమ అనేది ఈ కోణం నుంచే చూడాల్సివుంటుంది. హైద్రాబాదు సంస్థానానికి అధిపతిగా వున్న నిజాం నవాబు పాలనలో ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారో చరిత్ర తెలిసిన ప్రతి ఒక్కరికీ తెలుసు. నీ బాంచన్ కాల్మొక్కుతా అనే దశలో ప్రజల పరిస్థితి వుండేది. నవాబ్ కింద జిల్లాల్లో దేశముఖ్ లు , జాగిర్దార్ లు పటేల్, పట్వారి లు ప్రజల్ని నానా హింసలు పెట్టేవాళ్ళు. అందులో వెలమ దొరలు కూడా ఒక భాగమే. ఉర్దూ భాషను బలవంతంగా రుద్దటంతో ఆంధ్ర భాషోద్యమం మొదలయ్యింది. అందులోనుంచే సంఘం, నిజాం వ్యతిరేక ప్రజా ఉద్యమం మొదలయ్యింది. కమ్యూనిస్టులు దాదాపు 10 లక్షల ఎకరాలు ప్రజలకు పంచగలిగారు. స్వామి రామానందతీర్ధ లాంటి కాంగ్రెస్ నాయకులూ స్వతంత్ర పోరాటాన్ని హైద్రాబాదు గడ్డపై విస్తరింపచేశారు. ప్రజల్లో వ్యతిరేకత ఉద్రతమయ్యే కొద్దీ నిర్బంధాలు ఎక్కువయ్యాయి. నిజాం పాలనను పరిరక్షించే పేరుతో రజాకార్లు చేయని దారుణాలు లేవు. మతకలహాలు రెచ్చగొట్టారు. 1947 ఆగష్టు 15 మిగతా దేశానికి స్వతంత్రం వస్తే హైద్రాబాదు మాత్రం నిజాం పరిపాలన లోనే వుంది. స్వతంత్రంగా శాశ్వతంగా వుండాలని కలలు కన్నాడు. చివరకి భారత ప్రభుత్వం సెప్టెంబర్ 17 వ తేదీన సైన్యాన్ని దింపి నిజాం ని లొంగదీసుకుంది. సర్ధార్ పటేల్ కి నిజాం దాసోహమన్నాడు. ఇదీ చరిత్ర. సెప్టెంబర్ 17 హైద్రాబాదు నిజాం పాలన నుంచి విముక్తి అయ్యి భారతదేశం లో కలిసిన చారిత్రాత్మక దినం. అంత చారిత్రాత్మక రోజుని మనం ప్రతి సంవత్సరం ఉత్సవంగా జరుపుకోవటం మనందరి కర్తవ్యం.

ఈ విషయం లో కెసిఆర్ కప్పదాటు వైఖరి క్షమించరానిది. దీనికి రెండు కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటి చరిత్రపై తనకున్న భావన , నిజాం నవాబ్ హైదరాబాద్ అభివృద్ధిలో అమోఘమైన కృషిచేసాడని నమ్మటం. రెండోది ఓటు బ్యాంకు రాజకీయాలు. సెప్టెంబర్ 17 వ తేదీని విమోచన దినంగా జరిపితే ముస్లిం లు ఎక్కడ దూరం అవుతారో ననే భయం. ఈ విషయం లో రజాకార్ల వారసులైన మజ్లీస్ నాయకుడు అసదుద్దీన్ ఓవైస్సీ ప్రభావం కూడా కెసిఆర్ పై ఉందనిపిస్తుంది. ఈ ఆలోచనే కెసిఆర్ కి ముందు ముందు పెద్ద గుదిబండ లాగ తయారవుతుంది. అసలు సెప్టెంబర్ 17 వ తేదీని స్మరించుకోకపోవటం, దీన్ని మత దృక్కోణం లో చూడటం అంత ఘోరం చరిత్రలో ఇంకోటిలేదు . నిజాం నవాబ్ వ్యతిరేకపోరాటం ప్రజల మనస్సులో బలంగా నాటుకున్న అంశం. దీన్ని ఓటుబ్యాంక్ రాజకీయాల్లోనుంచి చూసినా కెసిఆర్ కి నష్టమేగాని లాభం లేదు. ఇందాకనే చెప్పినట్లు బలమైన నాయకుడు కి బలమూ, బలహీనత కూడా అదే. తను చేసిన మంచిపనులు కూడా తెలంగాణ ప్రజలు మరిచిపోయి తనపై వ్యతిరేకతని మూట కట్టుకోవటానికి సెప్టెంబర్ 17 వ తేదీ సంఘటన ముందు ముందు బలమైన కారణం కావచ్చు. ఇప్పటికైనా భేషిజానికి పోకుండా ప్రజల సెంటిమెంటును దృష్టిలో పెట్టుకొని సెప్టెంబర్ 17 వ తేదీ విమోచన దినోత్సవాన్ని జరిపితే మంచిది.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.
 

Most Viewed

విషాదంలో క్రీడా ప్రపంచం.. ప్రమాదంలో బాస్కెట్‌ బాల్ దిగ్గజం మృతి

ఏపీ శాసనమండలి రద్దు ను అసెంబ్లీలో ప్రకటించిన జగన్

శాసనమండలి రద్దు కావాలంటే.. ఇది ప్రాసెస్

మండలికి మంగళం.. కేబినెట్ ఆమోదం

జాతీయ జెండాను అవమానించిన ఎంపీ

నగరంలో మసాజ్ సెంటరే వ్యభిచార గృహం..

హైదరాబాద్ లో నీటి సరఫరా నిలిపివేత.. కారణం ఇదే

మన సంస్కృతిని మారుద్దామా?

మోడీకి దిమ్మతిరిగే గిఫ్ట్ ఇవ్వనున్న కాంగ్రెస్...!

కేటీఆర్‌ కి అద్భుతమైన బహుమానం సిద్ధంచేసిన కేసీఆర్‌?

మళ్లీ ఆ తప్పు చేయనంటున్న లావణ్య త్రిపాఠి

గవర్నర్‌ తో భేటీ... మండలి రద్దుకు సన్నాహాలు?

వెంకటేష్ 'నారప్ప' లీక్డ్ వీడియోస్.. సోషల్ మీడియాలో వైరల్

టీవీ9లో లైంగిక వేధింపులు.. తాకరాని చోట తాకుతూ, హోటల్ కి రమ్మని..

సింధుకు పద్మభూషన్, మేరీ కోమ్ కు పద్మ విభూషణ్

ఈ దేశంలో మోడీ ఒక్కడే హిందునా..? కెసిఆర్ కీలక వ్యాఖ్యలు

అమెరికాలో మహేష్ కి సర్జరీ, ఐదు నెలలు రెస్ట్!

మున్సిపల్ ఎన్నికల్లో తెరాస జాతీయ స్థాయి రికార్డు

జబర్దస్త్ యాంకర్ రష్మి 'సిస్టర్' ఫొటోస్.. చూస్తే మీరు షాక్ అవ్వలిసిందే

లైవ్ స్పీచ్: కెసిఆర్ ప్రెస్ మీట్