కాకినాడ వీధుల్లో అల్లు అర్జున్ యాక్షన్ సీన్స్

త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ కథానాయకుడిగా ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకి 'నాన్న నేను' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ షూటింగును 'కాకినాడ'లో జరుపుకోనుంది. ఆల్రెడీ ఈ సినిమా టీమ్ అక్కడికి చేరుకుంది. అల్లు అర్జున్ తదితరులపై యాక్షన్ సీన్స్ తో పాటు కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు.

కాకినాడ వీధుల్లోను .. బీచ్ లోను ఈ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. రెండు వారాల పాటు అక్కడ షూటింగును జరుపుకుని, ఆ తరువాతనే ఈ సినిమా టీమ్ తిరిగిరానుంది. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం రావు రమేశ్ ను అనుకున్నారు. కొన్ని కారణాల వలన ఆయన తప్పుకోవడంతో, ఆ స్థానంలోకి హర్షవర్ధన్ ను తీసుకున్నారు. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.