తెలంగాణ జర్నలిస్టుల 'ఛలో హైదరాబాద్'..!

తెలంగాణ కమిటీ ఇచ్చిన పిలుపుతో హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ అధ్వర్యంలో కలెక్టరేట్ ముందు జర్నలిస్టులు ధర్నా చేపట్టారు. ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తెస్తున్న తమకు ఉన్న ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరకట్లేదంటున్న జర్నలిస్టులు... ఛలో హైదరాబాద్ కలెక్టరేట్ నిర్వహించారు. ఎన్నో ఉద్యమ సంఘాలు ఆందోళనలకు దిగుతున్నాయి. ఆ సంఘాల సమస్యల్ని తెరపైకి తెస్తున్న జర్నలిస్టులు... తమ సమస్యలపై ఆందోళనలకు దిగారు.

కలెక్టరేట్ ముందు చేపట్టిన జర్నలిస్టుల ధర్నాకు సీపీఐ మద్దతు తెలిపింది. సిపిఐ నేత నారాయణ, బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య జర్నలిస్టులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు. ఐక్యతను నిరూపించి ఉద్యమ స్ఫూర్తితో తమ సమస్యల పరిష్కారం కోసం తరలివచ్చి... ఛలో హైదరాబాద్ కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినట్లు జర్నలిస్టులు తెలిపారు.

 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.