అమెరికా టూర్‌లో బిజీగా జగన్, అదరకొడుతున్న కొత్త లుక్

అమెరికా పర్యటనలో బిజీ, బిజీగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. వాషింగ్టన్ చేరుకున్న సీఎంకు ఎన్‌ఆర్‌‌ఐలు, వైసీపీ అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం భారత రాయబార కార్యాలయ సీనియర్‌ అధికారులు అరుణీశ్‌ చావ్లా‌(ఐఏఎస్‌), నీల్‌కాంత్‌ అవ్హద్‌ (ఐఏఎస్‌)లు జగన్‌ను కలిసి ఆహ్వానించారు. అనంతరం భారత రాయబారి హర్హవర్ధన్ ష్రింగ్లా ఆహ్వానం మేరకు విందుకు హాజరయ్యారు.

అమెరికా విదేశాంగ శాఖ దక్షిణాసియా వ్యవహారాల ఉన్నతాధికారులతో జగన్‌ సమావేశమయ్యారు. వాషింగ్టన్‌‌లో యూఎస్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కీలక సమావేశానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు. అక్కడ భారత రాయబారి హర్షవర్ధన్‌ ష్రింగ్లాతో సీఎం సమావేశమై ముఖాముఖి చర్చలు జరిపారు. యూస్‌ ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో జగన్ ప్రసంగించారు.

పరిశ్రమలకు పెట్టాలనుకునేవారికి రెడ్‌టేపిజం అడ్డంకులు తమ ప్రభుత్వంలో ఉండబోవని సీఎం స్పష్టంచేశారు. తమ రాష్ట్రంలో ఎవరైనా పరిశ్రమలు పెట్టాలనుకుంటే కేవలం ఒకే ఒక్క దరఖాస్తు నింపితే సరిపోతుందన్నారు. తన కార్యాలయమే దగ్గరుండి అన్ని పనులూ చేస్తుందని చెప్పారు. ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ అండ్‌ మానిటరింగ్‌ అథారిటీ (ఇప్మా) పారిశ్రామిక వేత్తలకు పెట్టుబడిదారులకు చేదోడు వాదోడుగా ఉంటుందన్నారు. పరిశ్రమలకు అవసరమైన భూములు, కరెంటు, నీరు సమకూర్చిపెడతామన్నారు. ఏ రాష్ట్రానికైనా కేంద్ర ప్రభుత్వ సహాయం అవసరమేనని.. ఇరుగుపొరుగు రాష్ట్రాలతో మంచి సంబంధాలున్నాయని చెప్పారు.

ముఖ్యమంత్రి జగన్ ఆగస్టు 17న డల్లాస్‌ చేరుకుంటారు. అక్కడి కే బెయిలీ హచిన్సన్‌ కన్వెన్షన్‌ సెంటర్లో సాయంత్రం 6 గంటలకు (భారత కాలమానం ప్రకారం ఆగస్టు 18 ఉదయం 4:30 గంటలకు) జరిగే సభకు హాజరవుతారు. నార్త్‌ అమెరికాలో తెలుగు వాళ్లను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆగస్టు 18న మళ్లీ వాషింగ్టన్‌ చేరుకొని.. వ్యాపార సంస్థల ప్రతినిధులతో చర్చలు జరుపుతారు. ఆగస్టు 19, 20, 21న తన వ్యక్తిగత పనులతో ముఖ్యమంత్రి బిజీగా గడపనున్నారు. ఆగస్టు 22న మధ్యాహ్నం షికాగోలో మరికొన్ని సంస్థల ప్రతినిధులను కలుస్తారు.. తర్వాత అదే రోజు రాత్రి 8:30 గంటలకు అమెరికా నుంచి రాష్ట్రానికి తిరిగి బయల్దేరతారు.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.
 

Most Viewed

ఇకనుండి 'మాల్స్' 24 గంటలూ ఓపెన్: కేబినెట్ ఆమోదం

పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ షూటింగ్ వీడియో లీక్..

హైదరాబాద్ కి చేరిన చైనా వైరస్?

బాలకృష్ణతో రోజా సెల్ఫీ..ఫ్రేమ్ లో చంద్రబాబు కూడా..!

జనసేన ఎమ్మెల్యే రాపాకపై శ్రీరెడ్డి కేక పోస్ట్...!

టీఆర్ఎస్ అభ్యర్థి ముక్కు కొరికిన కాంగ్రెస్ అభ్యర్థి

రోడ్ పక్కన వివస్తగా పడివున్న మహిళ.. పక్కన కాండోమ్ లు

తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్న అంత‌ర్జాతీయ సంస్థ‌లు

తెలంగాణ లో పిరామల్ గ్రూపు 500 ల కోట్ల పెట్టుబడి

ఆందోళనకరంగా ఆర్ధిక అసమానతలు

రాజధాని మార్పు పై వైసీపీ నేతల భారీ ర్యాలీ!

పవన్ కళ్యాణ్ కి తిక్క.. జగన్ కేమో...

జగన్ కి షాక్ ఇచ్చిన ప్రధాని మోడీ నిర్ణయం

ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికలు

5 పెళ్లిళ్లు చేసుకొని ట్రెండింగ్ గా మారిన 52 ఏళ్ళ హీరోయిన్

వైసీపీలోకి మరో టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత జంప్!

వైరల్ అవుతున్న ఫోటో : వైస్సార్ విగ్రహాన్ని తగలబెట్టిన వైనం

ద్యావుడా.. అల.. వైకుంఠ.. భారీ వసూళ్లు

వెంకటేష్‌ కొత్త చిత్రం ‘నారప్ప’ ప్రారంభం!

పిల్లలకి జగన్ అందిస్తున్న 4 వరాలు ఇవే..