విక్రమ్ ని గుర్తించాం.. కానీ మాతో మాట్లాడటం లేదు:ఇస్రో

చంద్రుడిపై కూలిన విక్ర‌మ్ ల్యాండ‌ర్‌ ఉనికిని ఇస్రో సైంటిస్టులు గుర్తించారు. ఈ విషయాన్ని మంగళవారం ఇస్రో ట్వీట్ చేసింది. కానీ ఇంకా దాంతో కమ్యూనికేషన్ మాత్రం జరగలేదు. ల్యాండర్‌తో సంబంధాలు పునరుద్ధరించేందుకు అన్నిరకాల ప్రయత్నాలు కొనసాగుతున్నాయని’ ఇస్రో తన ట్వీట్‌లో పేర్కొంది.

సెప్టెంబర్ 7వ తేదీ తెల్లవారుజామున 1.40- 1.55 గంటల సమయంలో చందమామ మీద లాండింగ్ చేస్తున్న సమయంలో విక్రమ్ లాండర్‌తో ఇస్రోకు సంబంధాలు తెగిపోయాయి. చంద్రుడికి 2.1 కిలోమీటర్ల ఎత్తులో ఆ సంబంధాలు తెగిపోయినట్టు ఇస్రో ప్రకటించింది. అప్పటి నుంచి అది ఎక్కడ ఉందో ఆచూకీ తెలియలేదు. అయితే, చంద్రుడి చుట్టూ తిరుగుతున్న ఆర్బిటర్.. విక్రమ్ లాండర్‌ను గుర్తించింది.

ల్యాండర్ చెక్కు చెదరకుండా ఉందని నిన్న ఇస్రో అధికారి ఒకరు ప్రకటించిన విషయం తెలిసిందే. చంద్రయాన్ 2 ప్రయోగంలో భాగంగా విక్రమ్ లాండర్‌ను చంద్రుడి మీద దించడానికి ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్న సమయంలో లాండర్‌తో ఇస్రోకు సంబంధాలు తెగిపోయాయి. ఇప్పుడు మళ్లీ సంబంధాలను పునరుద్ధరించిన తర్వాత మరోసారి చంద్రుడి మీద దించే అవకాశం ఉంది. ఒకసారి విక్రమ్ లాండర్ చంద్రుడి మీద దిగిన తర్వాత దానిలో ఉన్న ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వస్తుంది. చంద్రుడి మీద అటూ ఇటూ తిరిగి అక్కడి మూలకాలను సేకరిస్తుంది.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.