భారత్‌ 5-0 గోల్స్‌ తేడాతో కివీస్‌ను చిత్తుచేసింది.

2019 ఒలింపిక్‌ సన్నాహక టోర్నీ ఫైనల్లోనూ భారత పురుషుల, మహిళల హాకీ జట్లు జయకేతనం ఎగురవేశాయి. బుధవారం జరిగిన మహిళల హాకీ ఫైనల్లో ఆతిథ్య జపాన్‌పై 2-1 గోల్స్‌ తేడాతో భారత మహిళల జట్టు విజయాన్ని నమోదు చేసింది. భారతజట్టు తరఫున నవ్‌జీత్‌ కౌర్‌(11వ ని.), లాల్‌రెమ్‌సైమి(33వ ని.) గోల్స్‌ చేశారు. జపాన్‌ తరఫున షిమ్జూ(12వ ని.)లో గోల్‌ చేసింది. మ్యాచ్‌ ప్రారంభమైన 10 నిమిషాల్లో బంతి భారత మహిళల జట్టు చేతిలోనే ఉంది. భారత్‌ గోల్‌ చేసిన ఒక నిమిషంలోనే జపాన్‌ గోల్‌ చేసింది. ఆ తర్వాత మూడో క్వార్టర్‌వరకూ ఇరుజట్లు గోల్‌ చేయలేకపోయాయి. భారత ఆటగాళ్ల డిఫెన్స్‌ బలంగా ఉండడం జపాన్‌ మహిళలు గోల్‌ చేయడంలో వెనుకబడ్డారు. ఇక పురుషుల హాకీ జట్టు న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించింది. బుధవారం జరిగిన ఫైనల్లో భారత్‌ 5-0 గోల్స్‌ తేడాతో కివీస్‌ను చిత్తుచేసింది. రౌండ్‌ రాబిల్‌ లీగ్‌ పద్ధతిలో జరిగిన ఈ పోటీల్లో లీగ్‌ దశలో భారత్‌ 1-2తో కివీస్‌ చేతిలో ఓడినా నేడు ఘన విజయం సాధించడం విశేషం. భారత్‌ తరఫున హర్మన్‌ప్రీత్‌ సింగ్‌(7), శంషేర్‌సింగ్‌(18), నీలకంఠ(22), గుర్షబ్జిత్‌సింగ్‌(26), మన్‌దీప్‌సింగ్‌(27) గోల్స్‌ చేశారు.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.