ప్రభాస్ పై అభిమానం: పిచ్చి ముదిరి పాకాన పడి టవర్ ఎక్కింది

హీరో ప్రభాస్ రావాలని.. లేదంటే తాను సెల్ టవర్‌పై నుంచి దూకేస్తానని ఓ వ్యక్తి హల్‌చల్ చేయడం చర్చనీయాంశంగా మారింది. జనగామ జిల్లా యశ్వంత్‌పుర పెట్రోల్‌ బంక్‌ పక్కన ఉన్న రిలయన్స్‌ సెల్‌ టవర్‌పైకి గుగులోతు వెంకన్న అనే యువకుడు ఎక్కాడు. గుగులోతు వెంకన్నది మహబూబాబాద్‌. అతడు ప్రభాస్‌ అభిమాని అని తెలుస్తోంది. ప్రభాస్‌ అంటే ఇష్టమని, ప్రభాస్‌ను చూడాలని ఉందని సెల్‌ టవర్‌పైకి ఎక్కిన వెంకన్న డిమాండ్‌ చేస్తున్నాడు. తనను చూసేందుకు, కలిసేందుకు ప్రభాస్‌ రాకపోతే సెల్‌ టవర్‌ దూకేస్తానని అతను బెదిరిస్తున్నాడు. ఇదేమీ విడ్డూరమని విస్తుపోతున్న స్థానికులు.. యువకుడిని బతిమాలి కిందికి దించేందుకు ప్రయత్నిస్తున్నారు.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.