హుజుర్ నగర్ ఉపఎన్నికలో తెరాసకు సమ్మె గండం!

హుజుర్ నగర్ ఉపఎన్నిక తెరాస కి సవాల్ గా మారింది. ప్రచార గడువు రేపటితో ముగుస్తున్నా.. పార్టీ నేతల్లో జోష్ కనిపించడం లేదు. మొదట 'నువ్వా - నేనా..' అని ఉన్న పోటీ కాస్త తగ్గుముఖం పట్టింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న సీఎం కెసిఆర్ భహిరంగ సభ నిన్న రద్దు కావడంతో అక్కడి తెరాస నాయుకులు డీలా పడిపోయారు. అంతకు ముందు నాలుగు రోజులు ప్రచారం చేయాల్సిన మంత్రి కేటీఆర్ కూడా ఒక్క రోజే ప్రచారం చేసి వెళ్లి పోయారు. దింతో తెరాస నాయకుల్లో జోష్ తగ్గింది. తెరాసకి మద్దతించిన సిపిఐ కూడా మద్దతును ఉపసంహరించుకోడంతో నాయకుల్లో ఉత్సహం మరింతగా తగ్గింది. తెరాస ఎమ్మెల్యే లు. ఎమ్మెల్సీ లు అక్కడే ఉన్నా గాని కేడర్ లో పెద్దగా ఉత్సహం కనిపించడం లేదు. సీఎం కెసిఆర్ వస్తే జోష్ ఉండేదని భావించిన పెద్దలు సభ రద్దు కావడంతో ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు.

ఈసి ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన రోజే తెరాస తన అభ్యర్థిగా సైది రెడ్డి ప్రకటించింది. జిల్లాకు చెందిన మంత్రి జగదీష్ రెడ్డిని కాదని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని పార్టీ ఎన్నికల ఇంఛార్జిగా నియమించింది. దింతో కొన్ని రోజులు పార్టీ విషయాలకు, ప్రచారానికి దూరంగా ఉన్న జగదీష్ రెడ్డి మరల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. అందర్నీ సమన్మయం చేసుకుంటూ పార్టీ శ్రేణుల్లో ఉత్సహం నింపారు. ఆయనతో పాటు మరి కొంత మంది పార్టీ నాయుకులు ప్రచారం లో పాల్గొన్నప్పటికీ కేడర్ లో అసంతృప్తి కనిపిస్తుంది.

ఉపఎన్నికలో తెరాసకు మద్దతించిన సిపిఐ తరవాత ఆర్టీసీ సమ్మె విషయంలో కెసిఆర్ వైఖరిని చూసి తన మద్దతును ఉపసంహరించుకుంది. కార్మికులతో చర్చలు జరపకుండా ప్రభుత్వం మొండిగా ప్రవర్తిస్తుండటంతో తెరాసపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని భావించిన సిపిఐ, తన మద్దతును ఉపసంహరించుకుంది. హైకోర్ట్ కూడా చర్చలతో కార్మికుల సమస్యలు తీరుతాయని చెబుతున్న ప్రభుత్వం ఎందుకు మొండిగా ప్రవర్తింస్తుందో పార్టీ శ్రేణులకె అర్థంకావడం లేదు. సమ్మె ప్రభావం లేదని పైకి ఎన్ని మాటలు చెబుతున్న గౌండ్ లెవెల్ లో వ్యతిరేకత తెలుస్తునట్టున్నారు గులాబీ నేతలు వాయిపోతున్నారు. ఆర్టీసీ సమ్మెకు ఉద్యోగుల సంఘాల కూడా మద్దతివ్వడం అధికార పార్టీని మరింత కలవరపెడుతుంది.

 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.