టాక్స్ రేట్ తగ్గింది, బుల్ రంకేసింది, దలాల్ స్ట్రీట్ చిందేసింది.

ఈ రోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పన్నుల తగ్గింపు పై కీలక ప్రకటన చేసిన విషయం తెల్సిందే..! ‘దేశంలోని ఏ కంపెనీ అయినాసరే 22 శాతం ఆదాయపు పన్ను చెల్లించాలి. అయితే ఈ కంపెనీలు కేంద్రం నుంచి ఎలాంటి మినహాయింపులు పొంది ఉండకూడదు’’ అని సీతారామన్ చేసిన ప్రకటనకు దేశీ స్టాక్ మార్కెట్‌ను లాభాల బాట పట్టించింది.

టాక్స్ రేట్ తగ్గింది. బుల్ రంకేసింది దలాల్ స్ట్రీట్ చిందేసింది. దేశీ స్టాక్ మార్కెట్‌లోకి లాభాలు కాదు.. భారీ లాభాలు వచ్చి చేరాయి. బెంచ్‌మార్క్ సూచీలు భారీగా ర్యాలీ చేశాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించడం మార్కెట్‌పై సానుకూల ప్రభావం చూపింది.

ఇంట్రాడేలో సెన్సెక్స్ ఒకానొక సమయంలో ఏకంగా 2285 పాయింట్ల మేర పరుగులు పెట్టింది. ఇండెక్స్ ఈ స్థాయిలో పెరగడం పదేళ్ల కాలంలో (2009, మే18 నుంచి) ఇదే తొలిసారి. సెన్సెక్స్ 38,378 పాయింట్ల స్థాయిని తాకింది. 2009లో మార్కెట్‌లో ఒకే రోజు 2,110 పాయింట్లు ర్యాలీ చేసింది. నిఫ్టీ కూడా 677 పాయింట్ల లాభంతో 11,382 పాయింట్ల స్థాయిని టచ్ చేసింది.

సెన్సెక్స్ చివరకు 1921 పాయింట్ల లాభంతో 38,015 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. జూలై 22 నుంచి ఈ మార్క్ వద్ద ఇండెక్స్ క్లోజ్ కావడం ఇదే తొలిసారి. నిఫ్టీ 569 పాయింట్ల లాభంతో 11,274 పాయింట్ల వద్ద ముగిసింది. జూలై 26 నుంచి చూస్తే ఇండెక్స్‌కు ఇదే బెస్ట్ క్లోజింగ్.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.