హిందీలోనూ విజ‌యం అందుకున్న‌ టాలీవుడ్ మూవీ

‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చిత్రంతో తెలుగు తెర‌కు క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యాడు న‌వీన్ పొలిశెట్టి. మొద‌టి సినిమాతోనే బ్లాక్‌బ‌స్ట‌ర్‌ అందుకున్న ఈ టాలెంటెడ్ హీరో… తాజాగా మరో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్నాడు. అయితే, ఈ సారి తెలుగు చిత్రంతో కాదు ఓ హిందీ చిత్రంతో ఈ స‌క్సెస్ చూశాడు న‌వీన్‌. ఆ చిత్ర‌మే `ఛిఛోరే`. సుశాంత్ సింగ్ రాజ్ పుత్, శ్రద్ధా కపూర్ జంటగా న‌టించిన ఈ యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో… హీరో ఫ్రెండ్స్‌లో ఒక‌డిగా క‌నిపించాడు న‌వీన్‌. కాలేజీ బ్యాక్ డ్రాప్‌లో తెర‌కెక్కిన ఈ చిత్రంలో యాసిడ్ పాత్ర‌లో తనదైన‌ కామెడీ టైమింగ్‌తో ఉత్త‌రాది ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నాడు మ‌న ఏజెంట్‌. మొత్త‌మ్మీద‌… రెండున్న‌ర నెల‌ల గ్యాప్‌లో ఇటు టాలీవుడ్‌లోనూ, అటు బాలీవుడ్‌లోనూ రెండు మెమ‌ర‌బుల్ హిట్స్‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు న‌వీన్‌.

ఇదిలా ఉంటే… తెలుగులో న‌వీన్ క‌థానాయ‌కుడిగా రెండు ఆస‌క్తిక‌ర‌మైన చిత్రాలు తెర‌కెక్క‌బోతున్నాయి. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు ఈ సినిమాల‌ని నిర్మిస్తాయ‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే వీటికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న‌లు వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.