ఆత్మకూరులో హై టెన్షన్!

గత కొద్ది రోజులుగా గుంటూరులో నిర్వహిస్తున్న వైసీపీ బాధితుల శిబిరంలో ఆశ్రయం పొందుతున్న టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులను స్వయంగా తానే వెంట ఉండి ఈ నెల 11న ఆత్మకూరు గ్రామానికి తీసుకువెళతానని ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన అధికార పార్టీ కూడా అదే రోజు ఛలో ఆత్మకూరుకు పిలుపు ఇచ్చింది. ఈ క్రమంలో ఛలో ఆత్మకూరుకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో దుర్గి మండలంలోని ఆత్మకూరు గ్రామంలో పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా మారింది. శాంతిభద్రతల సమస్య దృష్ట్యా ఇప్పటివరకు ఏ పార్టికి కూడా ఛలో ఆత్మకూరు కార్యక్రమంలో అనుమతి ఇవ్వలేదని, పల్నాడులో పోలీసు నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయని గురజాల డీఎస్పీ శ్రీహరిబాబు మంగళవారం ప్రకటించారు. అధికార, ప్రతిపక్షాల రాజకీయ క్రీడలో ఏ క్షణం ఏమి జరుగుతుందో అర్థంగాక పల్నాడు ప్రజలలో తీవ్ర ఆందోళన నెలకొంది. ముందు జాగ్రత్త చర్యగా అధికార యంత్రాంగం పల్నాడులో ఇప్పటికే 144 సెక్షన్ విధించింది.

ఎన్నికల అనంతరం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వైఎస్‌ఆర్ సీపీ నేతలు తమ పార్టీ కార్యకర్తలపై వరుస దాడులకు పాల్పడుతున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. తమ పార్టీ వారిపై దాడి చేసి తిరిగి తమ పార్టీవారి పైనే కేసులు నమోదు చేస్తున్నారని టీడీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. చట్టప్రకారం పనిచేసి ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారి అక్రమ కేసులతో తమ వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలుగుదేశం దేశం వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. గత్యంతరం లేని పరిస్థితులలో తెలుగుదేశం పార్టీవారు ప్రాణాలను కాపాడుకోవడానికి గ్రామాలు విడిచి పారిపోవాల్సి వస్తోందని చెబుతున్నాయి. పల్నాడులోని సమస్యాత్మక గ్రామాల నుండి సుమారు 500 కుటుంబాలు ప్రాణ రక్షణ కోసం గ్రామాలు విడిచి వెళ్లాయని చెబుతున్నారు. దేశంలో ఈ పరిస్థితి ఎక్కడా లేదని, ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం ప్రత్యర్థి పార్టీలపై దాడులకు పాల్పడి, వారిని ఊరి నుండి తరిమికొట్టడం ఆందోళన కలిగించే విషయమని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. తమ పార్టీ కార్యకర్తలకు పోలీసులు రక్షణ కల్పించక పోవడంతో తాము కార్యకర్తలను రక్షించుకునేందుకు పునరావాస శిబిరాలను ఏర్పాటు చేయవలసి వచ్చిందని తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నారు. తమ పార్టీ కార్యకర్తలను క్షేమంగా వారి ఇళ్ల దగ్గర దిగబెట్టి రావడానికే ఛలో ఆత్మకూరు కార్యక్రమానికి పిలుపునిచ్చినట్లు టీడీపీ నేతలు స్పష్టం చేస్తున్నాయి.

అయితే అధికార వైసీపీ తమకు పోటీగా అదే రోజు ఛలో ఆత్మకూరుకు పిలుపునివ్వడం ఏ మేరకు సమంజసం అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అధికారులు ఓ వైపు గుంటూరు పునరావాస శిబిరంలో చర్చలు జరుపుతూ మరోవైపు గురజాల డివిజన్‌లో 144 సెక్షన్ విధించటం ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి అద్దం పడుతోందని దేశం వర్గాలు పేర్కొంటున్నాయి. ఇది రాజకీయ శాంతి భద్రతల సమస్యగా భావిస్తున్నామన్నారు. బాధితులకు న్యాయం చేయాలన్నదే టీడీపీ దృఢ సంకల్పమన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై పెట్టిన తప్పుడు కేసులన్నీ ఎత్తివేయాలని, ధ్వంసమైన ఆస్తులకు నష్టపరిహారం చెల్లించాలని గత 110 రోజులుగా గ్రామాలు విడిచి వుంటున్న బాధితులకు లక్ష రూపాయలు నష్ట పరిహారం అందించాలని, బాధిత గ్రామాలలో పోలీసు పికెట్లు ఏర్పాటు చేయడంతో పాటు పోలీసు పహారా పెంచాలని, ఆయా గ్రామాల్లో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయాలని, నిందితులపై బైండోవర్ కేసులు నమోదు చేయాలని, వేధింపులకు గురిచేసి తొలగించిన అంగన్‌వాడీ, ఫీల్డ్ అసిస్టెంట్, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, చౌక డిపో డీలర్లను వెంటనే తిరిగి నియమించాలని, గ్రామాల్లో రాజకీయ దాడులపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని టీడీపీ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ డిమాండ్ల సాధన కోసమే ఛలో ఆత్మకూరు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేస్తున్నాయి.

ఇదిలా వుండగా గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రధానంగా అప్పటి అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, అప్పటి గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు చేసిన దోపిడీలు, దౌర్జన్యాలకు వారి మీద నమోదైన కేసులను కప్పిపుచ్చి పల్నాడులో అశాంతి రేపేందుకే తెలుగుదేశం పార్టి ఛలో ఆత్మకూరుకు పిలుపునిచ్చిందని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే తప్పులు చేశారో వారే భయపడి గ్రామాలు విడిచి వెళుతున్నారు తప్ప సామాన్య ప్రజలు ప్రశాంతంగానే జీవిస్తున్నారని పేర్కొంటున్నాయి. ఎన్నికల అనంతరం పల్నాడులో క్రైం రేటు తగ్గిన విషయాన్ని వైసీపీ నాయకులు గుర్తుచేస్తున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హాయాంలో ప్రజలు కరువుకాటకాలతో అల్లాడి పోయారని కృష్ణానది పొంగి, ప్రాజెక్టులు నిండి పంటలకు సరిపడినంత సాగునీరు అందుతుండటంతో ప్రజలు వ్యవసాయ పనులలో నిమగ్నమయ్యారని పేర్కొంటున్నారు. ఎన్నికల అనంతరం వైసీపీ ప్రభుత్వం నిరంతరం అభివృద్ధి కార్యక్రమాలతో నిమగ్నమై పల్నాడుకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ మంజూరు, దాచేపల్లి, గురజాల పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చడం, కృష్ణానది నీటిని ఇంటింటికి చేర్చే పనిలో నిమగ్నం కావడంతో ప్రభుత్వానికి ఎక్కడ మంచిపేరు వస్తుందోనన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ పెయిడ్ ఆర్టిస్టులతో రాజకీయ దాడుల అంశాలను తెరపైకి తెచ్చిందని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ తరపున ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు స్వయంగా రంగంలోనికి దిగి తమ పార్టీ ముఖ్య నాయకులు కాలువ శ్రీనివాసులు, నక్కా ఆనంద్ బాబు, యరపతినేని శ్రీనివాసరావు ఇతర ముఖ్యనాయకులతో కలసి ఛలో ఆత్మకూరుకు పిలుపు నివ్వడం దానికి దీటుగా రాష్ట్ర హోం మంత్రి సుచరితతో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, కాసు మహేష్‌రెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలతో సహా పలువురు అగ్రనాయకులు ప్రత్యేక దృష్టి సారించడంతో పల్నాడు సమస్య రాష్ట్ర సమస్యగా రూపాంతరం చెందింది.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.
 

Most Viewed

ఇక యుద్ధం జరిగేది జగన్-పవన్ మద్యే..!

జగన్ పాలన బాగుంటే సినిమాలు చేసుకుంటా అన్నవుగా..తథాస్తు!

అభివృద్ధి రానప్పుడు..మారిస్తే, కంగారెందుకు?

జగనన్న గోరుముద్ద.. రోజుకో రకం భోజనం.. వైరల్ అవుతున్న మెనూ!

సరిలేరు నీకెవ్వరు మూవీ సరికొత్త రికార్డు

ఈరోజు రాత్రి అత్యవసర భేటీ.. మంత్రులకు సీఎం ఆదేశం

దొంగతనం చేస్తూ.. అడ్డంగా దొరికిపోయిన పోలీస్.. వైరల్ వీడియో

ఐటీఐలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం...

మళ్ళీ పవన్ కి సెటైర్ వేసిన ఆర్జీవీ!

వైసీపీ నేతలకి తలనొప్పిగా మారిన మూడు రాజధానుల బిల్లు

వైజాగ్ వద్దు, ఈసారికి విజయవాడ: జగన్ సర్కార్

ఇండియా పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ స్టార్ హీరో..!

అప్పుడు చంద్రబాబు.. ఇప్పుడు జగన్.. రియల్ ఎస్టేట్ మాఫియా

హాట్ హాట్ ఫోటోలతో.. సురేఖావాణి రచ్చ!

RRR అప్డేట్: రంగంలోకి బాలీవుడ్ సూపర్ స్టార్

తెలంగాణాలో మున్సి‘పోల్స్’.. ప్రత్యేక ఏర్పాట్లు

అసెంబ్లీ సమావేశాలలో చంద్రబాబుపై విమర్శల దాడి పెంచిన వైసీపీ

టీడీపీకి మరో కీలక నేత రాజీనామా..?

జగన్, చంద్రబాబుల ఆసక్తికర సంభాషణ

అంతా.. నువ్వే చేసావు.. చంద్రబాబు!