'గుణ 369' తో హిట్ కొడతాను: హీరో కార్తికేయ

కార్తికేయ కథానాయకుడిగా అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో రూపొందిన 'గుణ 369' వచ్చేనెల 2వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ జోరందుకున్నాయి. తాజా ఇంటర్వ్యూలో కార్తికేయ మాట్లాడుతూ .. "ఒంగోలు ప్రాంతానికి చెందిన ఒక మధ్యతరగతి యువకుడి జీవితంలో జరిగిన సంఘటనను ఆధారంగా చేసుకుని ఈ కథను తయారు చేసుకోవడం జరిగింది.

అర్జున్ జంధ్యాల ఈ కథ వినిపించగానే నాకు బాగా నచ్చేసిందని చెప్పాను. ఫలానా చోట పాట పడాలి అని కాకుండా .. కామెడీని ఇరికించే ప్రయత్నం చేయకుండా సహజంగా కథను నడిపించడానికే ఆయన ఆసక్తిని చూపుతుంటాడు. ఆయన టేకింగ్ స్టైల్ నాకు బాగా నచ్చింది. హీరోయిన్ 'అనఘ' పాత్ర కూడా సహజత్వానికి దగ్గరగా ఉంటూ అందరినీ ఆకట్టుకుంటుంది. తప్పకుండా హిట్ కొడతామనే నమ్మకం వుంది" అంటూ ఆశా భావాన్ని వ్యక్తం చేశాడు.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.