గుణ 369 ట్రైలర్ రిలీజ్

ఇటీవలే హిప్పీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తికేయ ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు. అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో కార్తికేయ హీరోగా వాస్తవ సంఘటనల ఆధారం గా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘గుణ 369’. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. పాటలను కూడా ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

“లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీకి సంబంధించిన సన్నివేశాలపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. హీరోయిన్ ను ప్రేమిస్తూ.. హీరో ఆమె వెంటపడటం, తాను అనుకున్నది సాధించడం కోసం విలన్ తో గొడవకి సిద్ధపడటం వంటి సన్నివేశాలపై కట్ చేసిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది.

కాగా ఈసినిమాలో కార్తికేయ పక్కన మలయాళ బ్యూటీ అనఘ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రతినాయకుడిగా ఆదిత్య మీనన్ నటిస్తుండగా, ఒక కీలకమైన పాత్రను మంజుభార్గవి పోషిస్తోంది. స్ప్రింట్ ఫిల్మ్స్, జ్ఞాపిక ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై ఈ సినిమాను అనిల్ కడియాల, తిరుమల రెడ్డి నిర్మిస్తున్నారు. RX 100 వంటి బ్లాక్ బస్టర్ మూవీ కి సంగీతం అందించిన చైతన్ భరద్వాజే ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.