గుణ 369 మూవీ రివ్యూ

తారాగణం : కార్తికేయ, అనఘ, మహేష్‌, ఆదిత్య, నరేష్‌, హేమ
సంగీతం : చైతన్‌ భరద్వాజ
దర్శకత్వం : అర్జున్‌ జంద్యాల
నిర్మాత : అనిల్, తిరుమల్ రెడ్డి, ప్రవీణ కడియాలు
రేటింగ్ : 2.5/5

‘ఆర్‌ఎక్స్‌100’తో కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు కార్తికేయ. విఫల ప్రేమికుడిగా ఆ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని సాధించింది. ఇక ఏడాది ఇప్పటికే ‘హిప్పీ’గా ప్రేక్షకుల ముందుకు వచ్చి పర్వాలేదనిపించాడు. ముచ్చటగా మూడో చిత్రంగా ‘గుణ 369’ అంటూ మరోసారి అలరించేందుకు సిద్ధమయ్యాడు. మరి కార్తికేయ ఈ చిత్రంతో మరో విజయాన్ని అందుకున్నాడా? బోయపాటి శిష్యుడైన అర్జున్‌ జంధ్యాల కార్తికేయను ఏవిధంగా చూపించాడు?

కథ :

గుణ (కార్తికేయ) ఎలాగైనా బీటెక్‌ పాసై తన తండ్రి కోరిక తీర్చాలనుకునే సాధారణ కుర్రాడు. కాలనీలో అందరికీ సాయం చేస్తూ మంచి కుర్రాడిగా పేరు తెచ్చుకుంటాడు. అదే కాలనీకి కొత్తగా వచ్చిన గీత (అనఘ) అనే అమ్మాయితో గుణ ప్రేమలో పడతాడు. గుణ మంచితనం గురించి తెలిసి గీత కూడా అర్జున్‌ను ఇష్టపడుతుంది. కానీ అదే సమయంలో ఓ స్నేహితుడికి సాయం చేయబోయి గుణ ఇబ్బందుల్లో పడతాడు. గద్ధలగుంట రాధ(ఆదిత్య) అనే రౌడీ హత్య కేసులో గుణ జైలుకు వెళతాడు. దీంతో అప్పటి వరకు హ్యాపీగా సాగిపోతున్న గుణ జీవితం చిన్నాభిన్నం అవుతుంది. గుణ కుటుంబం ప్రమాదంలో పడుతుంది. ఈ సమస్యల నుంచి గుణ ఎలా బయటపడ్డాడు.? అసలు రాధను హత్య చేసింది ఎవరు? వాళ్లను గుణ ఏం చేశాడు? అన్నదే మిగతా కథ.

నటీనటులు :

రెండు చిత్రాల అనుభవం మాత్రమే ఉన్న కార్తికేయ ఈసారి మరింత బలమైన, బరువున్న పాత్రను ఎంచుకున్నాడు. రెండు సినిమాలకంటే అతనిలో ఇందులో పరిణతి ఎక్కువ కనిపిస్తుంది. తొలి సగంలో భయస్తుడిగా, అల్లరి పిల్లాడిగా కనిపించిన ఈ పాత్ర, ద్వితీయార్థానికి వచ్చే సరికి తన స్వరూపాన్ని మార్చేసుకుంటుంది. పతాక సన్నివేశాల్లో కార్తికేయ నటన మరింత నచ్చుతుంది. కథానాయికగా అనఘకు ఇదే తొలి చిత్రం. తన వరకూ బాగానే చేసింది. కాకపోతే, పరిచయం ఉన్న కథానాయికను ఎంచుకుని ఉంటే ఆ పాత్ర మరింతగా పండేది. నరేష్‌, హేమలు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ‘రంగస్థలం’ మహేశ్‌కు ఈ సినిమాతో మరిన్ని మార్కులు పడతాయి.

ప్లస్‌ పాయింట్స్‌ :

కథ
విశ్రాంతి ఘట్టం
క్లైమాక్స్‌

మైనస్‌ పాయింట్స్‌ :

ప్రథమార్థంలో కొన్ని సన్నివేశాలు
లవ్‌ సీన్స్‌

సాంకేతిక విభాగం :

దర్శకుడు అర్జున్ జంధ్యాల క్లైమాక్స్ ను మరియు కొన్ని సన్నివేశాలను ఎమోషనల్ గా బాగా తెరకెక్కించినప్పటికీ.. తీసుకున్న స్టోరీ లైన్ కి పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఆయన కథా కథనాలని రాసుకోలేకపోయారు. చైతన్ భరద్వాజ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఆయన అందించిన పాటల్లో రెండు బాగున్నాయి.

రాంరెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను ఆయన ఎంతో రియలిస్టిక్ విజువల్స్ ను చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. తమ్మిరాజు ఎడిటింగ్ బాగుంది. కానీ అక్కడక్కడా ఉన్న కొన్ని సాగతీత సీన్స్ ను తగ్గించాల్సింది. నిర్మాతలు అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి, ప్రవీణ కడియాల ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వాళ్ళ నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

తీర్పు :

ఈ చిత్రం బి.సి సెంటర్ ప్రేక్షకులకు కొంతమేరకు కనెక్ట్ అవుతుంది.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.