దసరా సెలవులకు వెళ్ళొచి బోటు తీస్తున్న అధికారులు!

తెలుగులో మంచి సామెత ఉంది.. ఏమిటంటే "సిగ్గు లేని వాడికి నవ్వే సింగారం". ఈ సామెత గోదావరి బోటు బయటకే తీసే అధికారులకు ఆ బోటుని బయటు తీయాలని ఆదేశించిన పెద్దలకు కరెక్ట్ గా సూట్ అవ్వొచ్చు. ఎందుకంటే నెల రోజులు గడుస్తున్నా.. గోదావరిలో మునిగిన బోటును తీయడం చేతకాని అధికార యంత్రంగం. దసరా సెలవలు అయిపోయిన తరవాత ఇప్పుడు వచ్చి బోటును బయటకి తీస్తున్నాం అనడం నిజంగా సిగ్గు చేటు.

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు మందం వద్ద గోదావరిలో మునిగిన బోటు వెలికితీత చర్యలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం బృందం మూడు రోజుల పాటు గాలింపు చేపట్టినా ఫలితం లేకపోయిందట. ఈ లోపు గోదావరిలో వరద పెరగడంతో బోటు వెలికితీత పనులను నిలిపి వేసారట. అయితే రెండు గంటల్లోనే బోటును బయటకు తీస్తానని గతంలో సవాల్ విసిరిన పశ్చిమ గోదావరికి చెందిన వెంకట శివ మరోమారు తెరపైకి వచ్చారు. ఈ ప్రబుద్ధుడు ఏమైనా చేశాడా అంటే ఏమి లేదు.

ఇది కూడా చదవండి:ఏడు చేపల కథను గుర్తుచేస్తున్న వశిష్ఠ బోటు వెలికితీత!

"అన్నీ తెలిసినమ్మ అమావాశ్య నాడు చస్తే, ఏమీ తెలియనమ్మ ఏకాదశి నాడు చచ్చిందిట!" ఈ సామెత ధర్మాడి సత్యం బృందం కి అనువయించుకోవచ్చు

 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.