గాయాలు కాదు తీపి గుర్తులు: సుధీర్

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నాని హీరో గా ‘వి’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో నాని నెగిటివ్ షేడ్ లో కనిపించనున్నట్టు గత కొద్దికాలంగా వార్తలు వస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ సినిమాలో సుధీర్ బాబు కూడా మరో హీరో గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ లో భాగంగా తన చేతికి అయిన గాయాల్ని తలుచుకుంటూ.. ట్విట్టర్ ద్వారా ఓ ఫోటోని పోస్ట్ చేస్తూ స్వీట్ మెమోరీస్ అంటూ పోస్ట్ లో పేర్కొన్నాడు..

ఇక సినిమాలో నివేదా థామస్, అదితి రావు హైదరి హీరోయిన్లు గా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. మరి ఇంద్రగంటి, నాని కాంబినేషన్ లో వచ్చిన ‘అష్టా చమ్మా’, ‘జెంటిల్ మన్’ సినిమాలు హిట్ అయ్యాయి. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా కావడంతో.. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మరి వీరు హ్యాట్రిక్ కొడతారో..? లేదో..? తెలియాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.

ప్రస్తుతం నాని నటించిన గ్యాంగ్ లీడర్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ నెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. మరి చూద్దాం ఏం జరుగుతుందో..!

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.